రాజాసాబ్ మూడు రోజుల కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది!
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ ప్రయాణం ఊహించని విధంగా సాగుతోంది.;
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ ప్రయాణం ఊహించని విధంగా సాగుతోంది. సినిమా విడుదలైన సమయం నుండి సాధారణ ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం ఒక రకమైన నిలకడ కనిపిస్తోంది. ముఖ్యంగా పండుగ సెలవులు కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకు సంఖ్య స్థిరంగా ఉండటం గమనార్హం.
సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 183 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. మిక్స్‌డ్ టాక్ నడుస్తున్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం ఇండియాలోనే ఈ చిత్రం మూడు రోజులకు గాను రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అంచనా.
ఇక మూడో రోజు వసూళ్ల విషయానికి వస్తే ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా రూ. 22.6 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీతో సంబంధం లేకుండా కలెక్షన్లు హోల్డ్‌లో ఉండటం విశేషం. సినిమా కంటెంట్‌పై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ లో ఈ స్థాయి అంకెలు నమోదు కావడం బాక్సాఫీస్ వద్ద సినిమా పట్టును సూచిస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా రాజాసాబ్ తన ఉనికిని చాటుకుంటోంది. మొదటి మూడు రోజుల్లో విదేశీ మార్కెట్ నుండి సుమారు రూ. 31.80 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అంచనా. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా లెక్కలు కూడా వైరల్ అవుతున్నాయి. అక్కడ ఇప్పటికే 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కును దాటినట్లు చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సినిమా ఒక సాధారణ టెంపోలో సాగుతోంది. సంక్రాంతి సెలవులు ముగిసే వరకు ఇదే రకమైన హోల్డ్ కొనసాగితే నిర్మాతలకు లాభమే. టాక్ ఎలా ఉన్నా సరే వసూళ్లలో పెద్దగా డ్రాప్ కనిపించకపోవడం సినిమాకు ఒక సానుకూల అంశం. సెలవుల తర్వాత కూడా ఇదే నిలకడ కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఏదేమైనా 'ది రాజా సాబ్' మూడు రోజుల కలెక్షన్స్ చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద తన పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరికొంత స్పీడ్ పెంచాల్సి ఉంది. పండుగ వాతావరణం ముగిసిన తర్వాత సినిమా అసలైన స్టామినా ఏంటనేది స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో మిగతా సినిమాల పోటీని తట్టుకుని ఈ వసూళ్లు ఎక్కడ ఆగుతాయో చూడాలి.