ఆమె ఆఖరి మాటలే నిజమయ్యాయ్‌

Update: 2016-04-05 05:24 GMT
సీనియర్ నటి కల్పన ఊపిరి సినిమా షూటింగ్ కోసం హైద్రాబాద్ వచ్చినపుడు.. ఇక్కడే మరణించిన విషయం తెలిసిందే. మలయాళ నటి అయిన కల్పన - అనేక కన్నడ - తమిళ చిత్రాల్లోనూ నటించారు. తన టైమింగ్ తో కామెడీని.. ఎమోషనల్ సీన్స్ ను పండించడంలో కల్పనకు చాలా మంచి పేరుంది.

ఊపిరి సినిమాలో కల్పన నాగార్జున ఇంట్లో వంట మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె పలికిన ఆఖరి డైలాగ్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 'త్వరగా అమ్మా.. నాకు అంత టైం లేదు' అనేవే ఊపిరిలో కల్పన పలికిన చివరి మాటలు. నాగార్జునకు ఓ వంటకం తయారు చేస్తూ కనిపిస్తూ ఈ మాట అంటుంది కల్పన.

ఆమె చెప్పిన ఉద్దేశ్యం వంట చేయడం గురించే అయినా.. నిజంగానే ఆ తర్వాత కల్పన అనతి కాలంలోనే సుదూర తీరాలకు చేరిపోయారు. చనిపోయేవరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానని ఎప్పుడూ అంటూ ఉండే కల్పన.. ఇలా తన సినిమాలో ఆఖరి మాటలో తన తిరిగిరాని ప్రయాణం గురించి ఇలా చెప్పారన్న మాట అని.. సినీ ఇండస్ట్రీ కంటతడి పెడుతోంది.
Tags:    

Similar News