మత్తెక్కిస్తున్న మలయాళ కుట్టి సొగసుల్..

Update: 2020-05-29 12:30 GMT
ఈ మధ్య కుర్ర హీరోయిన్లంతా అందాల ఆరబోతకు వెనుకాడడం లేదు. టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా వీరి అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కిస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి చేరింది మలయాళ కుట్టి మాళవిక మోహనన్. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకు ఛాయాగ్రహణం అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్‌ కూతురే ఈ మాళవిక. ఇదివరకే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాలో రజినీ చెల్లెలి పాత్రలో మెరిసింది. అయితే ఆ సినిమా మాళవికకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇంకా పేట సినిమాలో అమ్మడు చీరకట్టులో కనిపించింది. కానీ ఇప్పుడు కళ్లు చెదిరే రీతిలో అందాలు ఆరబోస్తున్న మాళవికను చూసి షాకైపోతున్నారు అభిమానులు.

మాస్టర్ సినిమా అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుండి అమ్మడి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అప్పటి నుండి మాళవిక ఎక్కడ చూసినా క్లీవేజ్ అందాలతో సెగలు రేపుతోంది. మాములుగా కేరళ హీరోయిన్స్ ఈ స్థాయిలో అందాల విందు చేయడం అరుదు. ఎంతైనా ట్రెడిషనల్ లుక్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తుంటారు. కానీ మాళవిక మాత్రం వాళ్లకు భిన్నంగా స్టన్నింగ్ లుక్స్‌తో కుర్ర గుండెల్లో మంట పెడుతుంది. టాప్ హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని ఫీచర్స్ మాళవికలో ఉన్నాయి కానీ.. సరైన అవకాశాలు రావడమే ఆలస్యం. తమిళంలో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన 'మాస్టర్' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మాళవిక అందాలు తెలుగు తెరపై కూడా సందడి చేయబోతున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా 'హీరో' అనే క్రేజీ మూవీతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ సుందరి. ఇక తాజాగా అమ్మడి ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే ఖచ్చితంగా మతిపోవాల్సిందే!
Tags:    

Similar News