మహేష్ వ్యానిటీ లగ్జరీకా బాప్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త వ్యానిటీ వచ్చేసింది. ప్రిన్స్ న్యూ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేయబోతున్నాడని 'తుపాకీ' ముందే చెప్పింది. ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ వ్యానిటీని మహేష్ కొనుగోలు చేస్తున్నాడని వెల్లడించింది. కాగా.. ఈ వ్యాన్ మహేష్ చెంతకు రావడం.. షూటింగ్ స్పాట్ కు ప్రిన్స్ తీసుకెళ్లడం కూడా మొదలైపోయింది.
బయటి నుంచే అద్భుతంగా కనిపించే ఈ వ్యానిటీ.. లోపలికి వెళ్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేసి, మనసుకు నచ్చిన రీతిలో ఈ వ్యాన్ ను సిద్ధం చేయించుకున్నాడు ప్రిన్స్. ఇండియాలోనే టాప్ మోస్ట్ వ్యానిటీల్లో ఒకటిగా నిలిచిన మహేష్ వ్యాన్.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ వ్యానిటీ కన్నా కాస్ట్లీ అనే ప్రచారం సాగుతోంది.
ఇందులోని సౌకర్యాలను చూస్తే లగ్జరీకా బాప్ అనాల్సిందే. లోపల శాటిలైట్ టీవీ కనెక్షన్ తోపాటు ఒక మినీ కిచెన్ ఉంది. గెస్టులు వస్తే కూర్చోవడానికి మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక, అద్దిరిపోయే బెడ్ రూమ్ తోపాటు అనువైన బాత్‌రూమ్ కూడా ఉంది. ఇందులో చన్నీళ్లతోపాటు, వేడినీళ్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి.
పుణెకు చెందిన ఆటోమొబైల్ డిజైనర్ సంస్థకు ప్రత్యేకండా ఆర్డర్ ఇచ్చి ఈ వ్యానిటీ సిద్ధం చేశాడు మహేష్. కేవలం వ్యాన్ ఖరీదు రూ.6.25 కోట్లు కాగా.. తనకు ఇష్టమైన రీతిలో ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి మరో రూ.2 కోట్లు ఖర్చు చేశాడు ప్రిన్స్. ఇటీవల హావెల్స్ కంపెనీకి చెందిన ఓ యాడ్ షూట్లో పాల్గొన్నాడు మహేష్. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా డైరెక్ట్ చేసిన ఈ యాడ్ షూట్లో పాల్గొనడానికి ఇదే వ్యానిటీలో వెళ్లొచ్చాడు ప్రిన్స్.కాగా.. గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇలాంటి లగ్జరీ కారవ్యాన్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా సూపర్ స్టార్ వ్యానిటీ కూడా వచ్చేయడంతో.. టాలీవుడ్లో టాప్ వ్యానిటీలు ఉన్న స్టార్లుగా నిలిచారు మహేష్, బన్నీ.