కొడుకుతో ఆడుకుంటున్న సూపర్ స్టార్...!

Update: 2020-04-16 08:50 GMT
కరోనా భయంతో సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో తాము ఏమి చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కొందరు ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమకు తోచిన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్ లతో కుటుంబానికి దూరంగా ఉండే టాప్ స్టార్స్‌ ఇప్పుడు షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని తమ కుటుంబం తో కలిసి సరదా గడిపేందుకు వినియోగించుకుంటున్నారు. ఇక ఎప్పుడూ ఖాళీ దొరికినా ఫ్యామిలీతో సమయం గడిపేందుకు ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ బాబు ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బేసికల్‌గా మహేష్ బాబుకు తన కుటుంబంతో గడపడమంటే మహా సరదా. ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో కూడా ఏ మాత్రం బ్రేక్ వచ్చినా భార్యాపిల్లతో టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తుంటారు.

ఇప్పుడు కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఈ క్వారంటైన్ సమయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. భార్యా పిల్లలతో ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. ఆయన సతీమణి నమ్రత వారి ఫ్యామిలీకి సంభందించిన అప్డేట్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్య డైలీ ఒక త్రో బ్యాక్ పిక్స్ షేర్ చేస్తున్న నమ్రత ఇప్పుడు లేటెస్టుగా మరో అన్ సీన్ పిక్ షేర్ చేసింది. 'మెమరీ థెరపీ.. లిటిల్ మూమెంట్స్.. గ్రేట్ మెమొరీస్' అంటూ కామెంట్స్ జత చేసింది. ఈ ఫోటోలో తనయుడు గౌతమ్ మహేష్ మీద ఎక్కి కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ తండ్రీకొడుకులని చూసి ఆనందపడుతున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు తన కెరీర్లో 27వ చిత్రాన్ని కృష్ణ బర్త్ డే సందర్భంగా సార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
Tags:    

Similar News