ప్రభాస్‌కి మొదటిసారి లవ్‌లో పడాలనిపించిందట
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న సినిమాను ఇంతలా ప్రశంసించారంటే, ఆ సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉందనే చెప్పాలి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న సినిమాను ఇంతలా ప్రశంసించారంటే, ఆ సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉందనే చెప్పాలి. సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం `కపుల్ ఫ్రెండ్లీ` గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో మొదటిసారి తనకు లవ్ లో పడాలనిపించిందని ప్రభాస్ అన్నారు.
లవ్ లో పడాలనిపించేంతగా ఈ సినిమాలో ఏం ఉందో? ప్రభాస్ కి ఏం నచ్చిందో కానీ, అందరినీ థియేటర్ కి వెళ్లి సినిమా చూడమంటున్నాడు. లేదంటే ఎంతో కొంత మిస్ అయిపోతారని మూవీకి కితాబిచ్చేసాడు..హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి, దర్శకుడు చంద్ర అందరితో కలిసి ప్రభాస్ ప్రమోషన్ లో పాల్గొన్నాడు. అన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ సంతోష్ సరదాగా చాలా విషయాలను ముచ్చటించారు.
అయితే లవ్ లో పడాలి అని ప్రభాస్ కి ఎందుకు అనిపించింది అంటే.. సాధారణంగా ప్రభాస్ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ ఆయనకు క్లీన్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కపుల్ ఫ్రెండ్లీ చూసిన తర్వాత ఆ సినిమాలో ఉన్న నిష్కల్మషమైన ప్రేమ, కథాంశం, బ్యాక్‌డ్రాప్ ఆయనకు బాగా నచ్చాయట. చాలా కాలం తర్వాత ఇంత హాయిగా అనిపించే లవ్ స్టోరీ చూశాను.. సినిమా చూస్తుంటే మళ్ళీ లవ్‌లో పడాలనిపిస్తోంది అని సరదాగా వ్యాఖ్యానించారు.
సంతోష్ శోభన్ మీద ప్రత్యేక అభిమానం..
సంతోష్ శోభన్ తండ్రి దివంగత దర్శకుడు శోభన్ ప్రభాస్‌తో `వర్షం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీశారు. ఆ కృతజ్ఞతతో ప్రభాస్ ఎప్పుడూ సంతోష్ శోభన్ సినిమాలకు మద్దతుగా నిలుస్తారు. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యువీ క్రియేషన్స్ అసోసియేషన్‌లో నిర్మించడం విశేషం. కేవలం ప్రేమ మాత్రమే కాదు.. మధ్యతరగతి కుటుంబాల ఆశలు, ఆశయాలను దర్శకుడు బాగా చూపించారని ప్రభాస్ మెచ్చుకున్నారు.