ట్రెండీ లుక్‌తో మైండ్ బ్లాక్ చేసిన ప్రియాంక చోప్రా
గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా తన కొత్త హాలీవుడ్ మూవీ `ది బ్లఫ్` ప్రెస్ టూర్ లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.;
గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా తన కొత్త హాలీవుడ్ మూవీ `ది బ్లఫ్` ప్రెస్ టూర్ లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 25న విడుదలవుతుండగా ప్రచారంలో అదరగొడుతోంది. పీసీ లేటెస్ట్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా తాజా ఫోటోషూట్ లో వైట్ అండ్ వైట్ కో-ఆర్డ్ సెట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
దుస్తుల డిజైన్ ని విశ్లేషిస్తే, ప్రెస్ టూర్ మొదటి రోజు కోసం ప్రియాంక ఒక క్లాసీ వైట్ బ్లేజర్.. దానికి మ్యాచింగ్ అయ్యే వైట్ వైడ్-లెగ్ ట్రౌజర్స్‌ని ఎంపిక చేసుకుంది. ఇది చాలా పవర్‌ఫుల్ ఎలివేషన్ తో ప్రొఫెషనల్ లుక్‌ని ఇస్తూనే పీసీఆమెలోని ఫ్యాషన్ ఐకాన్‌ను ఎలివేట్ చేసింది. ఈ వైట్ లుక్‌కు కాంట్రాస్ట్‌గా నిమల్ గోల్డ్ జ్యువెలరీ, స్టైలిష్ సన్ గ్లాసెస్ ధరించింది. ముఖ్యంగా పీసీ థై స్లిట్ ఎలివేషన్ ఉన్న గౌన్, ఇన్నర్ అందాలను ఆవిష్కరించే స్టైల్ యూత్ కి కనెక్టయింది.
ప్రియాంక ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన సినిమా థీమ్ అయిన #పైరేట్ కోర్‌ను కూడా ప్రస్తావించింది. సినిమా కాన్సెప్టు ప్రకారం.. ఇందులో ఒక సముద్రపు దొంగ పాత్రలో పీసీ నటిస్తోంది. కాబట్టి ప్రెస్ టూర్ లో కూడా ఆ పైరేట్ వైబ్‌ని (లెదర్, బూట్స్, లేదా అడ్వెంచరస్ ఎలిమెంట్స్) తన మోడ్రన్ డ్రెస్సింగ్‌లో మిక్స్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం లండన్, అమెరికాలోని వివిధ నగరాల్లో పర్యటిస్తోంది.
43 ఏళ్ల వయసులో కూడా ప్రియాంక తన ఫ్యాషన్ సెన్స్‌తో నేటి తరం కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రయోగాత్మకమైన దుస్తులను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ది బ్లఫ్ ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరేబియన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో ప్రియాంక తన కుటుంబాన్ని కాపాడుకునే బ్లడీ మేరీ అనే పాత్రలో నటిస్తోంది.