అరుదైన వ్యాధితో X-Men నటుడు కన్నుమూత.. ఆ వ్యాధి లక్షణాలు, చికిత్స ఏంటంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు .;
ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు . ఇటు టాలీవుడ్ మొదలుకొని అటు హాలీవుడ్ వరకు అన్ని సినిమాలు వివిధ జానర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా భాషలకు చెందిన సెలబ్రిటీలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే వైరల్ అవుతోంది.
ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన శుభవార్తలు అభిమానులను సంతోష పెడుతుంటే.. అశుభ వార్తలు దుఃఖంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక నటుడు స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసి అటు హాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు ఇటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ నటుడు ఎరిక్ డేన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు. ALS (Amyotrophic lateral Sclerosis) అనే వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎరిక్ డేన్ కి వచ్చిన ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు ALS అంటే ఏంటి ? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి? ముందుగానే దీనిని అరికట్టలేమా? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ALS అంటే ఏంటి?
Amyotrophic lateral Sclerosis.. ఈ వ్యాధి నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సహజంగా కదలికలను నియంత్రించడానికి బాధ్యత వహించే నరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ కణాలు చనిపోవడంతో కండరాలు సందేశాలను స్వీకరించడం నిలిపివేస్తాయి. తద్వారా నరాల పనితీరు నష్టానికి దారితీస్తుంది. ఇకపోతే ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో కండరాల తిమ్మిరి, దృఢత్వం లేకపోవడం, అవయవాలలో బలహీనత, అస్పష్టమైన మాటలు ఏర్పడతాయి. సగం మంది రోగులలో దృష్టి, వినికిడి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
కనిపించే లక్షణాలు ఏంటి?
కనిపించే లక్షణాల విషయానికి వస్తే.. ఉన్నట్టుండి జారి పడడం, వస్తువులను కూడా పట్టుకోలేకపోవడం, అలసట వంటి చిన్న చిన్న లక్షణాలు మొదట కనిపిస్తాయి. ఆ తర్వాత కండరాల క్షీణత , తీవ్రమైన బలహీనత, కదలడంలో సమస్యలు ఏర్పడతాయి. ఇక ఈ వ్యాధి ముదిరే కొద్దీ పక్షవాతం, శ్వాస తీసుకోలేకపోవడం , స్వతంత్రంగా తినలేకపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
ఏ వయసు వారికి ఈ వ్యాధి సోకుతుంది?
ఇకపోతే ఈ వ్యాధి ప్రధానంగా 40 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. పురుషులు కొంచెం ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతారని అటు వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.
చికిత్స ఉందా?
ఇకపోతే ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే లేదు అనే చెప్పాలి. కానీ కొన్ని రకాల చికిత్సలు వ్యాధి తీవ్రతను తగ్గుముఖం పట్టిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులో రిలుజోల్, టౌరుర్సోడియోల్ వంటి చికిత్సలు వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి.
రోగనిర్ధారణ అయిన తర్వాత మనిషి జీవితకాలం ఎంత?
ఇకపోతే రోగ నిర్ధారణ అయిన తర్వాత 3 నుండి 5 సంవత్సరాల వరకు మనిషి తన మనుగడను కొనసాగిస్తారు. సుమారుగా 25% మంది రోగులు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన వారు కూడా ఉన్నారు. ఈ ప్రాణాంతక వ్యాధితో హాలీవుడ్ నటుడు ఎరిన్ డేన్ స్వర్గస్తులయ్యారు.
ఎరిన్ డేన్ నటించిన చిత్రాలు..
ఎరిన్ డేన్ నటించిన చిత్రాల విషయానికి వస్తే..X- Men, బ్యాడ్ బాయ్స్ , వాలంటైన్స్ డే , మార్లీ అండ్ మీ వంటి చిత్రాలలో నటించారు.