• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ ట్వీట్ 'మేజర్'...

మహేష్ ట్వీట్ 'మేజర్' జనాల్ని థియేటర్స్ కి రప్పిస్తుందా..?

By - Tupaki Desk
Update: 2020-03-28 15:45 GMT
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలు నిర్మాతలు అంటూ సపరేట్ గా లేరు. హీరోలే నిర్మాతలు నిర్మాతలే హీరోలు అంతే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు నిర్మాతల అవతారం ఎత్తారు. టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఈయన జిఎంబి ప్రొడక్షన్స్ మొదలుపెట్టి అందులో సినిమాలు నిర్మిస్తున్నాడు. తను నటించే ప్రతి సినిమాలో భాగస్వామిగా ఉంటున్నాడు. ఈ మధ్య రిలీజై ఘన విజయం సాధించిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా ఇలా వచ్చిందే. పారితోషికం బదులుగా ఆయన నిర్మాణంలో భాగం అవుతున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ బాబు బయట హీరోతో కూడా సినిమా నిర్మిస్తున్నాడు.

జిఎంబి ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అడవి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను కూడా నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ నిర్మాణ బాధ్యతలన్నీ నమ్రత చూసుకుంటుంది. ఇదిలావుండగా ఈ సినిమాను 9 కోట్లతో తీస్తానని అడవి శేషు నమ్రత దగ్గర ప్యాకేజీ మాట్లాడుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా ఉన్నట్లు కూడా చాలా మంది సినీ అభిమానులకు కూడా తెలియదు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మరి ఇలా సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఎవరికి తెలుస్తుంది. మహేష్ బాబు ఒక ట్వీట్ చేసినంత మాత్రాన అడవి శేష్ ని చూసి జనాలు థియేటర్స్ కి వస్తారా..?, ఎలాంటి అప్డేట్ లేకుండా మూవీ రెడీ చేసి థియేటర్స్ లో వదిలి తర్వాత ఒపింగ్స్ రాక తర్వాత బాధ పడటం షరా మామూలే. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో షూటింగ్ ఆపుకున్న 'మేజర్' మూవీ అప్డేట్ త్వరలోనే వస్తుందేమో చూడాలి.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • namratha 
  • mahesh babu 
  • adavi sesh 
  • major 
  • GMB Productions 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS