ఎట్టకేలకు పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతున్న మహేష్..!
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు తమ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నారు. తమ సినిమాలను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా.. ఇతర భాషల్లో కూడా విడుదల చేసి వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఆశ పడుతున్నాడు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయడానికి ట్రై చేయలేదు.
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ హీరో కటౌట్ తో ఉండే సూపర్ స్టార్.. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు మహేష్. అదే మల్టీ లాంగ్వేజ్ సినిమా చేస్తే మహేష్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని సినీ అభిమానులు భావిస్తుంటారు. 'స్పైడర్' సినిమాతో తమిళ్ లో అడుగుపెట్టాడు కానీ.. పాన్ ఇండియా వైడ్ ఆలోచనలు మాత్రం చేయలేదు.
అయితే దర్శక ధీరుడు రాజమౌళి తో మహేష్ బాబు చేసే సినిమా పక్కా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందనే విషయం మీద అందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు దాని కంటే ముందే సూపర్ స్టార్ మల్టీ లాంగ్వేజ్ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతున్నారని సమాచారం.
ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం #SSMB28 పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చేది యాక్షన్ జోనర్ మూవీ అని.. ఇది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టోరీ అని.. పరిస్థితులను బట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఆలోచన చేస్తామని నిర్మాత తెలిపారు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
#SSMB28 చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని టాక్ వినిపిస్తోంది.