అలాంటి మగాళ్లు ఫూల్సే అంటున్న మహేష్

Update: 2015-11-29 11:30 GMT
ఎప్పుడూ సినిమాల గురించే మాట్లడే మహేష్ బాబు.. తొలిసారి ఫ్యామిలీ విషయాలపై మాట్లాడుతున్నాడు. భార్య నమ్రత, పిల్లల గురించే కాక.. తన తల్లి, అమ్మమ్మల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహేష్. అంతే కాదు.. భార్య విషయంలో ఓ మగాడు ఎలా ఉండాలన్న విషయంలోనూ తనదై శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేశాడు ప్రిన్స్.

మహేష్ దృష్టిలో భార్యతో నమ్మకంగా ఉండటం చాలా ముఖ్యం. భార్యతో విధేయుడిగా లేని భర్త ఒక ఫూల్ అంటున్నాడు మహేష్. ‘‘నా దృష్టిలో పరిణతి ఉన్న మగాళ్లెవరైనా భార్యల దగ్గర విధేయులుగానే ఉంటారు. వాళ్లు చెప్పింది వింటారు. అలా లేని మగాళ్లూ ఫూలిష్ అని నా ఉద్దేశం’’ అని కుండ బద్దలు కొట్టాడు మహేష్. నమ్రతతో తాను నమ్మకంగా ఉండి ఉండకపోతే తనకు పెళ్లి అయిందని.. పిల్లలు ఉన్నారనే విషయమే తనకు గుర్తుండేది కాదని.. భార్యా పిల్లలతో సంతోషంగా గడిపే జీవితమే అసలై జీవితమని అన్నాడు మహేష్.

ఇక తనకున్న లేడీ ఫాలోయింగ్ విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహేష్. తనకు జోడీగా నటించే హీరోయిన్లెవరైనా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారా అని అడగ్గా.. ‘‘చాలామంది అమ్మాయిలు నేను అందంగా ఉన్నానని అంటారు. అంతకు మించి ఏమీ మాట్లాడరు’’ అని బదులిచ్చాడు. నమ్రతతో ఉన్నపుడు తాను తనలా ఉన్నట్లు ఫీలవుతానని మహేష్ చెప్పాడు.
Tags:    

Similar News