• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగడు బాధ.. బాహుబలి...

ఆగడు బాధ.. బాహుబలి టెన్షన్

By - Tupaki Desk
Update: 2015-09-14 07:30 GMT
సినిమా వాళ్లకు హిపోక్రసీ ఎక్కువ. ఫ్లాప్ అయిన తమ సినిమాల గురించి కానీ.. సూపర్ హిట్టయిన వేరే వాళ్ల సినిమాల గురించి కానీ మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడరు. కానీ మహేష్ బాబు అందరిలా కాదు. చాలా ఓపెన్ గా ఉంటాడు. అందుకే తాను ‘ఆగడు’ సినిమా చేయడం ఎంత పెద్ద తప్పో ఒప్పుకున్నాడు. ‘బాహుబలి’ సినిమా గొప్పదనం గురించి మాట్లాడాడు. ఈ రెండు సినిమాల గురించి మహేష్ చెప్పిన ఆసక్తికర సంగతులు చదవండి.

‘‘శ్రీమంతుడు ముందు నా రెండు సినిమాలు చేదు ఫలితాన్ని చూశాయి. ఐతే 1 నేనొక్కడినే సినిమా ఓ ప్రయోగం. దాన్ని క్రిటిక్స్ ఇష్టపడ్డారు. ఆ సినిమాకు సరిగా ఎడిట్ చేయకుండా హడావుడిగా విడుదల చేయడం వల్లే అలాంటి ఫలితం వచ్చిందని భావిస్తున్నా.  కానీ ఆగడు సినిమా చేయడం నేను చేసిన అతి పెద్ద తప్పిదం. నా కెరీర్ లో తొలిసారి నా నటన గురించి కూడా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నా. ఆ సినిమా నన్ను చాలా చాలా నిరాశ పరిచింది. రెండు నెలలు విరామం తీసుకున్నా. శ్రీమంతుడు ఓకే చేసినా.. ఆ స్క్రిప్టు మీద ఎంతో నమ్మకమున్నా కూడా షూటింగ్ కు వెళ్లడానికి టైం తీసుకున్నా. నేనా సమయంలో షూటింగుకి రెడీగా లేననిపించింది. ఐతే తప్పులు చేసినపుడు పాఠాలు నేర్చుకోవడం ముఖ్యం. ఆగడు నాకలాంటి పాఠమే నేర్పింది’’ అని ఆగడు సినిమా పెట్టిన బాధ గురించి వివరించాడు మహేష్.

బాహుబలి గురించి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి సినిమా నన్ను చాలా టెన్షన్ పెట్టింది. అలాంటి అద్భుతమైన సినిమా చూశాక.. ప్రేక్షకులు వెంటనే ఇంకో సినిమా చూడ్డానికి రెడీగా ఉండరు. ఇంతకుముందు మగధీర సమయంలో నాకు బాగా గుర్తుంది. రెండు మూడు నెలలు ఇంకే సినిమా ఆడలేదు. పైగా బాహుబలికి వచ్చిన రెస్పాన్స్ ఏంటో అందరికీ తెలిసిందే. దీంతో శ్రీమంతుడు ఎలాంటి ఫలితాన్నిస్తుందో..  జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను. పైగా నా గత రెండు సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో నా కెరీర్ లో ఏ సినిమాకు పడనంత టెన్షన్ ‘శ్రీమంతుడు’కే పడ్డాను. ముందు రోజైతే హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నంత టెన్షన్ లో ఉన్నా. నా చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంది’’ అన్నాడు మహేష్.
Tags:    
  • Mahesh babu 
  • Aagadu Movie 
  • Baahubali Movie 
  • Telugu NEws 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS