ఎర్రచందనంతో మహేష్ కేం పని ?

Update: 2019-02-02 09:29 GMT
ప్రస్తుతం మహర్షితో ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు ఇంకో రెండు నెలల్లో దానికి ప్యాక్ అప్ చెప్పేస్తాడు.  ఏప్రిల్ 25 రిలీజ్ డేట్ ప్రకటించేసారు కాబట్టి మార్చి చివరి వారం లేదా మరో పది రోజులు అటుఇటుగా ఫైనల్ కాపీ రెడీ చేయాల్సిందే. అయితే నెక్స్ట్ మూవీ సుకుమార్ తో ఇంతకు ముందే ఉంటుంది అని ప్రకటించిన మైత్రి సంస్థ దానికి తగ్గట్టు ఏర్పాటులో ఉన్నప్పటికీ కథ విషయం ఇంకా కొలిక్కి రాలేదని ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించి ఇటీవలే మహేష్ సుకుమార్ ఏకాంత మీటింగ్ లో చాలా సేపు దీని గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

ఎర్రచందనం రవాణా దొంగతనం బ్యాక్ డ్రాప్ లో చాలా కొత్తగా సుకుమార్ కథను వినిపించినట్టు ఇప్పటికే టాక్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తూ 1 నేనొక్కడినే తరహాలో కాకుండా సేఫ్ ఫార్ములాలో సుకుమార్ రాసుకున్నట్టుగా తెలిసింది. ఇలాంటి థీమ్ తో గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలు రాలేదు కాబట్టి కొత్తగా ఉండే ఛాన్స్ ఉంది.  మహర్షి పూర్తవ్వగానే మొదలుపెట్టినా ఇదే ఏడాది రావడం కష్టమే. పైగా ఎలాగూ సైరా సాహోలు 2019 సెకండ్ హాఫ్ ను ఆక్రమించుకుంటున్నాయి కాబట్టి వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసుకోవచ్చు.

అయితే సుకుమార్ డిమాండ్ చేసే బడ్జెట్ తీయాలనుకున్న టైం మీద ఇది ఆధారపడి ఉంటుంది. స్క్రిప్ట్ లాక్ అయ్యాకే హీరొయిన్ టెక్నికల్ టీం సెలక్షన్ చేపట్టబోతున్నారు. 1 నేనొక్కడినే పరాజయం పాలైనా సుకుమార్ టేకింగ్ మీద ప్రశంశలు వచ్చాయి. ఇప్పుడు రంగస్థలం తర్వాత చేస్తున్న మూవీ కాబట్టి ట్రేడ్ లో అంచనాలు మాములుగా లేవు. సుకుమార్ కూడా అందుకే తొమ్మిది నెలలు పూర్తైనా మహేష్ మూవీ స్క్రిప్ట్ మీద పూర్తి ఫోకస్ పెట్టాడు
Tags:    

Similar News