• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ పై అప్పుడే రాజమౌళి...

మహేష్ పై అప్పుడే రాజమౌళి ఎఫెక్ట్..

By - Tupaki Desk
Update: 2015-07-28 08:22 GMT
స్టార్ హీరోల్లో మహేష్ బాబు రూటే సెపరేటు. అతను మాస్ సినిమాలు మరీ ఎక్కువేమీ చేయలేదు. ఒక వేళ మాస్ సినిమా చేసినా అది కూడా క్లాస్ గానే ఉంటుంది. ఫైట్లు చేసినా.. వయొలెన్స్ ఉన్నా ఓ స్థాయి వరకే ఉంటుంది. మరి ఈ విషయంలో రాజమౌళి స్టయిలే వేరు. హీరో చేతికి ఓ స్పెషల్ వెపన్ ఇచ్చి విలన్లను తెగ నరికిస్తాడు. ఈగ లాంటి అల్ప జీవికి కూడా ఓ ఆయుధమిచ్చి విలన్ పైకి అటాక్ చేయించిన ఘనుడు రాజమౌళి. ఐతే ‘బాహుబలి’ సినిమాలో కొంచెం రూటు మార్చి విలన్ చేతికి ఓ కొత్త ఆయుధాన్నిచ్చాడు. ఐతే జక్కన్న బాహుబలి-2 తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ చేతికి ఎలాంటి ఆయుధాన్నిస్తాడా ఇప్పటికే చర్చ మొదలైపోయింది.

ఐతే రాజమౌళితో సినిమా చేయబోతున్న నేపథ్యంలో రిహార్సల్ గానో ఏమో.. ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ కొత్త తరహా ఆయుధం పట్టాడు మహేష్. ఆ రాడ్ బోల్ట్  రూపంలో చాలా చిత్రంగా ఉంది. ఆ ఆయుధం పట్టి విలన్లపై అటాక్ కు రెడీగా ఉన్న మహేష్ ను చూస్తుంటే అభిమానులకు పూనకం వచ్చేస్తోంది. ఈ పోస్టర్ చూడగానే మహేష్ పై అప్పుడే రాజమౌళి ఎఫెక్ట్ పడిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కు తోడు యాక్షన్ కూడా కలగలిగిన అన్ని వర్గాల్నీ ఆకట్టుకునేలా ‘శ్రీమంతుడు’ తయారైందని చెబుతున్నాడు మహేష్. 1 నేనొక్కడినే, ఆగడు నిరాశ పరిచిన నేపథ్యంలో ఆగస్టు 7న విడుదలయ్యే ఈ సినిమాపై మహేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS