చిరంజీవి చేస్తారా? మహేష్‌ బాబు వస్తాడా?

Update: 2016-11-25 07:30 GMT
దర్శకుడు శంకర్ గురించి మనం పెద్దగా చెప్పుకోవక్కర్లేదు. ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. పైగా మొన్ననే ''2.0'' ఫస్ట్ లుక్ తో ఆయన మతులు పోగొట్టేశారు కూడా. ఇప్పుడు శంకర్ ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం ఒక తెలుగు స్టార్ తో ఐదు నిమిషాల క్యామియో ఒకటి చేయించాలని చూస్తున్నట్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ విషయంలో ఆయన ఇద్దరి పేర్లను కూడా ఫైనల్ చేశాడట.

నిజానికి ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయాలని శంకర్ చాలా కలలు కన్నాడు. అసలు జెంటిల్మన్ సినిమా కతను మొదట చిరంజీవికి చెబితే.. ఆయన రిజక్ట్ చేసేశారు. ఆ తరువాత శివాజి సినిమా కథను కూడా శంకర్ వినిపించాడు కాని.. చిరంజీవి అప్పటికే కెరియర్ పట్ల వేరే ప్లాన్స్ తో ఉండటంతో అవి చేయలేదు. అందుకే ఇప్పుడు రోబో 2.0 సినిమాలో ఆయన్ను క్యామియో కోసం ఒప్పించాలని అనుకుంటున్నాడట శంకర్. ఒకవేళ చిరంజీవి ఒప్పుకోకపోతే?

అప్పుడు మహేష్‌ బాబుతో ఈ రోల్ చేయించాలని చూస్తున్నాడట. నిజానికి మహేష్‌ కూడా గతంలో శంకర్ సినిమాను రిజక్ట్ చేశాడు. 3 ఇడియట్స్ సినిమాను తెలుగు అండ్ తమిళంలో శంకర్ రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు.. మొదటి మనోడు ఎప్రోచ్ అయ్యింది మహేష్‌ నే. కాని తాను రీమేక్ సినిమాలను చేయనంటూ మహేష్‌ తిరస్కరించాడు. ఒకవేళ ఇప్పుడు శంకర్ ఎప్రోచ్ అయితే ఈ క్యామియో చేస్తాడా??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News