బాలీవుడ్ లో మహేష్ కి 6వ ర్యాంక్

Update: 2016-05-03 05:02 GMT
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2015.. ఈ లిస్ట్ లో రణవీర్ సింగ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. క్రికెటర్ గా ఎంత పేరు తెచ్చుకున్నాడో అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారంలోనూ అంతే క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫవాద్ ఖాన్ 3 - హృతిక్ రోషన్ 4 - సిద్ధార్ధ్ మల్హోత్రా 5వ స్థానాల్లో నిలిచారు. ఇదంతా కామన్ అయినా.. ఈ బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 6వ స్థానంలో నిలవడం విశేషం.

క్రేజ్ విషయంలో బాలీవుడ్ స్టార్లతో మహేష్ పోటీ పడుతూ ఉంటాడు. మన సూపర్ స్టార్ ఇష్టపడడు కానీ.. మహేష్ తో సినిమాకి బాలీవుడ్ ఎప్పుడో సై అనింది. అలాగే టాలీవుడ్ లో ఏ హీరోతో నటిస్తారు అని అక్కడి ఏ హీరోయిన్ ని అడిగినా.. టక్కున వచ్చే సమాధానం మహేష్ బాబు అనే. ఆల్మోస్ట్ బాలీవుడ్ లో టాప్ హీరో రేంజ్ కి ఏ మాత్రం తగ్గదు మహేష్ క్రేజ్. కలల హీరో అని పిలిపించుకునే రణబీర్ కపూర్ కంటే.. మహేష్ ర్యాంక్ ఎక్కువగా ఉందంటే.. అక్కడ జనాల్లో మనోడు ఏ రేంజ్ లో పాతుకుపోయాడో అర్ధమవుతుంది.

ఈ ఏడాదే కాదు.. గతేడాది కూడా మహేష్ ఈ ప్లేస్ లోనే నిలవగా.. 2013లో అయితే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మహేష్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ర్యాంక్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే అయినా.. క్రేజ్ విషయంలో అందరితో పోటీ పడుతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.
Tags:    

Similar News