మెగా మేన‌ల్లుడు ట్రాక్ పూర్తిగా మార్చేసాడే!

ఒకప్పుడు కేవలం కమర్షియల్ మాస్ మసాలా చిత్రాలకే పరిమితమైనా? తాజాగా రూట్ మార్చి కంటెంట్ ఈజ్ కింగ్ అనే సూత్రాన్ని పాటిస్తున్నాడు.;

Update: 2026-04-04 07:42 GMT

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కెరీర్ గ్రాఫ్‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఒకప్పుడు కేవలం కమర్షియల్ మాస్ మసాలా చిత్రాలకే పరిమితమైనా? తాజాగా రూట్ మార్చి కంటెంట్ ఈజ్ కింగ్ అనే సూత్రాన్ని పాటిస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను పక్కన పెట్టి వైవిధ్యమైన స్క్రిప్టులను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఈ మార్పు ఆయన కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పొచ్చు.`విరూపాక్ష` వంటి మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత సాయి తేజ్ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

కేవలం స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా కొత్త ఆలోచనలు , ట్రెండింగ్ కాన్సెప్ట్‌ల తో అప్ డేట్ గా ఉన్న‌ యువ దర్శకులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారికి అవకాశం కల్పిస్తూనే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన కమిట్ అయిన ప్రాజెక్టులను చూస్తే? అవన్నీ విభిన్నమైన జోనర్లకు చెందినవే. ప్ర‌స్తుతం రోహిత్ కె.పి దర్శకత్వంలో నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `సంబ‌రాల ఏటిగ‌ట్టు` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

రోహిత్ కొత్త ద‌ర్శ‌కుడైనా? తేజ్ ఎంతో కాన్పిడెండ్ గా ముందుకెళ్తున్నాడు. ప‌క్కా హిట్ ప్రాజెక్ట్ గా హైలైట్ అవుతుంది. తాజా `క‌` సుజిత్-సందీప్ ద్వ‌యంతో మ‌రో కొత్త ప్రాజెక్ట్ లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. యుగాలుగా బ‌య‌ట‌కు రాని ర‌హ‌స్యాలు, ఊహ‌కంద‌ని శ‌క్తులు అంటూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ తో ఒక్క‌సారిగా ఆస‌క్తిని పెంచేసాడు. పురాణాలు, వైజ్ఞానిక క‌ల్ప‌న మేళవిస్తూ గొప్ప సినిమాటిక్ అనుభ‌వాన్ని పంచ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాడు. దీంతో సాయితేజ్ ఎంత‌గా అప్ డేట్ అయ్యాడు? అన్న‌ది మ‌రోసారి ప్రూవ్అయింది. టెక్నాలజీ , ట్రెండింగ్ అంశాలను కథలో జోడించే దర్శకులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

సినిమా మేకింగ్‌లో వ‌స్తోన్న‌ మార్పులను గమనిస్తూ గ్లోబల్ ఆడియన్స్‌కు సైతం రీచ్ అయ్యేలా తన చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. కేవలం ఫైట్లు, పాటలు మాత్రమే కాకుండా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే ఉన్న కథలకే మొగ్గు చూపుతున్నాడు. దీంతో తేజ్ మార్కెట్ వాల్యూ కూడా గణనీయంగా పెరుగుతోంది. కేవలం నటనకే పరిమితం కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ , టెక్నికల్ అంశాల పట్ల కూడా సాయి తేజ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. తన సినిమాల్లో పనిచేసే సాంకేతిక నిపుణుల ఎంపికలో కూడా ఆయన జోక్యం చేసుకుంటూ అవుట్‌పుట్ అత్యుత్తమంగా వచ్చేలా చూసుకుంటున్నాడు. `సంబ‌రాల ఏటిగ‌ట్టు` భారీ వ‌సూళ్ల టార్గెట్ గా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News