రోజు ముందే సర్కార్ వారి మైండ్ బ్లాక్ ట్రీట్
సూపర్ స్టార్ మహేష్ ఏజ్ ఎంత..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత వీజీ కాదు. అతడి రూపం టీనేజర్ లుక్ కి షిఫ్టవుతుంటే అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకుముందు అతడు స్లిమ్ గా ట్రిమ్ గా కనిపిస్తే గౌతమ్ కృష్ణకు అన్నయ్యేమో అనుకున్నారు. ఇప్పుడు మరోసారి ఊహించని విధంగా షాకిచ్చారు మహేష్. ఈ కొత్త లుక్ చూశాక.. మళ్లీ ఏసేశాడు! ఇంత ఇస్మార్ట్ ఏంట్రా బాబూ? అంటూ అభిమానులు ఖంగు తింటున్నారు. ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. సూపర్బ్ లుక్.. టూమచ్ స్మార్ట్! అంటూ కితాబిచ్చేస్తున్నారు.
అంతగా మహేష్ రూపం మారిపోయింది. 40 ప్లస్ లోనూ 16 మైనస్ చూపిస్తూ మైమరిపించేస్తున్న అతడు గాళ్స్ గుండెల్లో నిదురపోవడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ లుక్ దేనికోసం? అంటే `సర్కార్ వారి పాట`(SSMB28)లో మహేష్ ఇలా కనిపిస్తారట. స్మార్ట్ గా అలా టక్ చేసుకుని ఫార్మల్స్ లో టెక్ బాబులా కనిపిస్తున్న మహేష్ ని చూస్తుంటే కళ్లార్పడం కష్టమే.
అతను తెలివైనవాడు.. అతను స్లిక్ ...అతను కఠినమైనవాడు.. అతను స్టైలిష్ ..! అంటూ పోయెటిక్ గా ఈ లుక్ ని పరిచయం చేశారు. 09 ఆగస్టు సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా `సర్కారు వారి పాట` నుంచి వరుస సర్ ప్రైజ్ లను ప్లాన్ చేయగా అంతకుముందే నిర్మాతలు ఈ లుక్ ని రివీల్ చేసి హీట్ పెంచారు. సూపర్ స్టార్ ఫార్మల్స్ లో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఏజ్ సగం పైగా తగ్గిపోయి కనిపించడం బిగ్ సర్ ప్రైజ్.
సర్కారు వారి పాట పై అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్లు ఇకపై పీక్స్ కి చేరనున్నాయి. ఈ సోమవారం ఉదయం 9:09 గంటలకు సినిమా మొదటి బ్లాస్టర్ విడుదల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. సినిమాను సంక్రాంతి 2022 కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.