సూసైడ్ చేసుకుంటానని బెదిరించిన మామ్!
అలాంటి నటి సినిమాల్లోకి వచ్చే క్రమంలో మామ్ నుంచి చాలా ఇబ్బందులే ఎదుర్కోంది అన్న విషయం ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. చదువు అయిపోగానే కొన్నాళ్ల పాటు అమ్మడు ఉద్యోగం చేసింది.;
బాలీవుడ్ నటి సయానీ గుప్తా గురించి పరిచయం అసవరం లేదు. సినిమా- వెబ్ సిరీస్‌లలో విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన నటి. అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు. అవసరమైతే గొంతు సవరించి గాయనిగా మారిపోతుంది. ఇండస్ట్రీకి రాక ముందే ? సంగీతం -నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమై సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. `సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్స` తో లాంచ్ అయిన బ్యూటీ `మార్గరీటా విత్ ఎ స్ట్రా` సినిమాలో ఖాన్మ్ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అటుపై `ప్యాన్` సినిమాలో షారుక్ ఖాన్ తో కలిసి తెరను పంచుకుంది. అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా రణబీర్ కపూర్ లాంటి స్టార్లతోనూ కలిసి పనిచేసింది. అయితే సినిమాల్ని మించి ఓటీటీలతో వరల్డ్ అంతా ఫేమస్ అయింది. `ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్` లో `అంజనా మీనన్` అనే లాయర్ పాత్ర తో బాగా పాపులర్ అయ్యింది.
`ఇన్సైడ్ ఎడ్జ్` లో రోహిణి రాఘవన్ పాత్రతో మరింత ఫేమస్ అయింది. వీటన్నింటిని మించి వ్యక్తిగతంగా అమ్మడు నెట్టింట వైరల్ అవుతుంటుంది. తరచూ మహిళల హక్కులు, సామాజిక అంశాల గురించి సోషల్ మీడియాలో గళాన్ని వినిపిస్తుంది.
అలాంటి నటి సినిమాల్లోకి వచ్చే క్రమంలో మామ్ నుంచి చాలా ఇబ్బందులే ఎదుర్కోంది అన్న విషయం ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. చదువు అయిపోగానే కొన్నాళ్ల పాటు అమ్మడు ఉద్యోగం చేసింది. మంచి జీతం..జీవితం సంతోషంగా సాగిపోతుంది. కానీ సినిమాల్లోకి వెళ్లాలి అన్న కల మాత్రం ఎంతకీ నెరవేరలేదు. దీంతో అమ్మడు ఓ రోజు అమ్మను పిలిచి సినిమాల్లోకి వెళ్తానని చెప్పింది. అందుకు మామ్ అంగీకరించలేదు. తనని ఇబ్బంది పెట్టి వెళ్తానంటే చేతి మణికట్టు కొసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మామ్ హెచ్చరించింది.
సినిమాల్లో హీరోయిన్లు అంటే చిన్న చూపు. సమాజం వారిని మరోలా చూస్తుంది. అలాంటివి మనకు అవసరమా? అని తల్లి మండిపడిందిట. కుమార్తె కూడా సినిమాల్లోకి వెళ్తే సమాజం వేరుగా చూస్తుందని మామ్ భయపడినట్లు తెలిపింది. కానీ తండ్రి మాత్రం అన్ని రకాలుగా మద్దతుగా నిలిచేవారుట. చివరికి ఆయనే తల్లిని ఒప్పించడంతో అంగీకరించారుట. తండ్రి సహకారంతోనే ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో చేరినట్లు తెలిపింది. అయితే ఆసమయంలో మామ్ నెల రోజుల పాటు మాట్లాడటమే మానేసారుట. ఆ తర్వాత కొన్ని రోజులకు తల్లి ఆలోచనల్లో కూడా మార్పు రావడంతో? అంతా సుఖమయం అయిందని తెలిపింది.