2.5ఎకరాల్లో భారీ సెట్.. 'ఆయా షేర్' అందుకే హిట్!

పాటలో కనిపించిన విజువల్స్, భారీ సెట్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.;

Update: 2026-03-13 12:13 GMT

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీపై రోజురోజుకూ హైప్ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. ఇటీవల సినిమా నుంచి రిలీజైన ఆయా షేర్ సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. పాటలో కనిపించిన విజువల్స్, భారీ సెట్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.



 


అయితే ఆ సాంగ్ కోసం మూవీ టీమ్ బాగా కష్టపడినట్లు తెలుస్తోంది. పాటలోని స్లమ్ ప్రాంతాన్ని ఒక సామ్రాజ్యంలా చూపించేలా భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టింది ఆర్ట్ డిపార్ట్మెంట్. నిజమైన ప్రాంతంలా కనిపించేలా నేచురల్ టెక్స్చర్, పాతదనం కనిపించేలా ప్రత్యేక టెక్నిక్స్ ఉపయోగించారు మేకర్స్.



 


కాగా, పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచే నిర్మాణాల్లో ఒకటి హీరో హౌస్. దాన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో నిర్మించారు మేకర్స్. మొదట 30 అడుగుల వెడల్పుతో ప్రారంభించిన ఆ సెట్ ను తర్వాత రెండు వైపులా 15 అడుగుల చొప్పున పెంచి మొత్తం 60 అడుగుల వెడల్పుతో కూడిన నిర్మాణంగా మార్చారు. దాన్ని సుమారు 25 మంది కార్మికులు 20 రోజుల పాటు కష్టపడి నిర్మించారు. ఏజింగ్ టెక్నిక్ ఉపయోగించి, చుట్టుపక్కల వాతావరణంతో కలిసిపోయేలా తీర్చిదిద్దారు.



 


పాటలో మరో ప్రత్యేక సెటప్.. పెద్ద బిర్యానీ గిన్నెలా కనిపించే నిర్మాణం. కాపర్ ఫినిష్‌ తో రూపొందించిన ఆ సెటప్‌ కు పాతదనాన్ని సూచించే టెక్స్చర్ ఇచ్చారు. దీని వెడల్పు సుమారు 10 అడుగులు కాగా, 20 అడుగుల రేడియస్, 6 అడుగుల ఎత్తుతో రూపొందించారు. ఆ నిర్మాణాన్ని 5-7 సభ్యులతో కూడిన టీమ్ ఐదు రోజుల్లో పూర్తి చేసింది.



 


అదే సమయంలో సాంగ్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్స్‌ లో మరొకటి వాటర్ బాడీ విలేజ్. ఇది మొత్తం 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో సుమారు 60 ఇళ్లను.. అవి కూడా డమ్మీల్లా కాకుండా నిజంగా ఉపయోగించగలిగే విధంగా తీర్చిదిద్దారు. అందుకు గాను దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు పనిచేశారు. ఒకేసారి సుమారు 500 మంది వరకు ఉండేలా రూపొందించారు.

వాటర్ బాడీ విలేజ్ కోసం సుమారు 100 ట్యాంకర్ల నీటిని తెప్పించి నింపారు. దానితోపాటు 20 అడుగుల లోతుతో ఒక చెరువు నిర్మించారు. 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో డంప్ యార్డ్ సెట్ రూపొందించారు. అయితే ఆయా షేర్ సెట్స్ నిర్మాణంలో ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత నిర్మాణం ప్రారంభించారు. ఇలా భారీ స్థాయిలో రూపొందించిన ఆ సెట్స్ వల్ల ఆయా షేర్ పాటలో కనిపించిన విజువల్స్ ప్రేక్షకులను అంతలా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News