ఆమీర్‌ఖాన్ ఆన్సర్ మైండ్ బ్లోయింగ్ అంతే!
ఈ నేపథ్యంలో ఆమీర్ ఖాన్ ఇచ్చిన ఆన్సర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన తాజా ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసిసే ఉంటున్నానని వెల్లడించారు.;
సినీ స్టార్స్‌లో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. బాలీవుడ్ టు కోలీవుడ్ వరకు కొంత మంది స్టార్స్‌ని కదిలిస్తే పెళ్లిళ్ల లిస్ట్ బయటికి వచ్చేస్తుంటుంది. రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. బాలీవుడ్‌లో అయితే పెళ్లిళ్లు, విడాకుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్ల కారణంగా వార్తలలో నిలుస్తున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్. సెకండ్ వైఫ్ కిరణ్ రావుకు 2021లో విడాకులు ఇవ్వడం తెలిసిందే.
2005లో కిరణ్ రావుని వివాహం చేసుకున్న ఆమీర్ తనతో 16 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమీర్ ఇటీవలే కొత్త గాళ్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌తో సహజీవనం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ముంబాయిలో జరిగే ప్రతీ ఈవెంట్‌లోనూ కలిసే కనిపిస్తున్నారు. దీంతో బాలీవుడ్‌లో వీరిపై కామెంట్‌లు వినిపిస్తున్నాయి. పెళ్లి కాకుండానే ఇద్దరూ కలిసి ఉంటున్నారని, ఈవెంట్‌లకు కలిసే వస్తున్నారని పలువురు బాలీవుడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమీర్ ఖాన్ ఇచ్చిన ఆన్సర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన తాజా ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసిసే ఉంటున్నానని వెల్లడించారు. తాజాగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ తన మ్యారేజ్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. `నేను, గౌరీ ఒకరిపై ఒకరం గౌరవంతో ఉన్నాం. అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా దృష్టిలో వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఈ రకంగా చూస్తే మేం వివాహం చేసుకున్నట్టే. ప్రస్తుతం మేం కలిసే ఉంటున్నాం. ఈ వివాహాన్ని అధికారికం చేయాలా వద్దా అన్నది భవిష్యత్తులో నిర్ణయించుకుంటాం.
మరో ప్రశ్నకు సమాధానంగా ఆమీర్‌ఖాన్ ఏన్నారంటే నా హృదయంలో పెళ్లి జరిగిపోయిందని అన్సర్ ఇవ్వడం గమనార్హం. గత ఏడాది ఆమీర్‌ఖాన్ తన 60వ పుట్టిన రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాజా ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేఝన్ గురించి బయటపెట్టాడు. అప్పటికే ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్టుగా స్పష్టం చేశాడు. అంతే కాకుండా తనని మీడియాకు పరిచయం చేస్తూ తనకెంతో మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చాడు. గౌరీ గత కొంత కాలంగా ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లో సహాయకురాలిగా వర్క్ చేస్తోంది.
అంతే కాకుండా ఆమీర్‌కు, గౌరీకి మధ్య గత 25 ఏళ్లుగా మంచి స్నేహ బంధం ఉందట. ఇప్పడు అదే బంధాన్ని ఆమీర్ వివాహ బంధంగా మార్చుకున్నాడు. గత కొంత కాలంగా సినిమాల పరంగా మంచి సక్సెస్‌లని దక్కించుకోలేకపోతున్న ఆమీర్‌ఖాన్ ప్రస్తుతం తనయుడు జునైద్ ఖాన్‌ని హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం జునైద్ హీరోగా థాయ్ మూవీ `వన్ డే` ఆధారంగా రొమాంటిక్ లవ్ స్టోరీ `ఏక్ దిన్`ని నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.