గొర్రెలా త‌ల ఊపొద్దు అంటోన్న ఐశ్వ‌ర్యారాయ్!

సొంత ఆలోచన లేక‌పోవ‌డం..పైవాళ్లు తానా అంటే వెనుకుండే వాళ్లు తందానా అన‌డం చాలా మందిలో క‌ని పిస్తుంది.;

Update: 2026-01-23 03:56 GMT

సొంత ఆలోచన లేక‌పోవ‌డం..పైవాళ్లు తానా అంటే వెనుకుండే వాళ్లు తందానా అన‌డం చాలా మందిలో క‌నిపిస్తుంది. ఒకరు చెప్పిన మాటలకు నిజానిజాలు ఆలోచించకుండా, తనకంటూ ఒక సొంత అభిప్రాయం లేకుండా `అవును`.. `అవును` అంటూ తల ఊప‌డం నేటి స‌మాజంలో చాలా మందిలో క‌నిపిస్తుంది. కొన్నిసార్లు ఏమీ అర్థం కాకపోయినా, అర్థమైనట్లు నటించేటప్పుడు లేదా ఎదుటివారికి క‌ట్టుబ‌డి వారు చెప్పినదానికల్లా తల ఊపడం. మ‌రికొంత మంది ప‌రిస్థితుల కార‌ణంగా వ్య‌క్తిత్వాన్ని చంపుకుని త‌ల ఊపాల్సిన సంద‌ర్భాలు ఎదుర‌వుతుంటాయి.

ఇలా ఎంత మాత్రం చేయోద్ద‌ని హిత‌వు పలికింది అందాల ఐశ్వ‌ర్యారాయ్. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎంత మాత్య‌రం ఇలాంటి విష‌యాల్లో వెన‌క్కి త‌గ్గొద్ద‌ని సూచించారు. మహిళలకు ఉన్న అతిపెద్ద ఆయుధం `గొంతుక`.ఏదైనా న‌చ్చ‌న‌ప్పుడు నిర్మొహమాటంగా నో చెప్పండి. ఓపెన్ గా మీ అభిప్రాయాన్ని పంచుకోండ‌న్నారు. అలా చెప్పిన‌ప్పుడే మ‌హిళ‌లో శ‌క్తి సామ‌ర్ధ్యాలు బ‌య‌ట‌కొస్తాయ‌న్నారు. ఇంట్లో , ఆఫీస్ లో ఎదుట వారి కోసం ఇష్టాల‌ను చంపు కోవ‌ద్ద‌న్నారు. అలా చేయ‌డం ఎంత మాత్రం స‌రికాద‌న్నారు. విజ‌యాలు ఎంత సంతోషంగా తీసుకుంటామో ..వైఫ‌ల్యాలు ఎదురైన‌ప్పుడు కూడా అంతే ధైర్యంగా నిల‌బ‌డాల‌న్నారు.

మన విలువలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తిరస్కరించడం కూడా గొప్ప విష‌య‌మేన‌న్నారు. న‌చ్చ‌ని వాటి విష యంలో నో చెప్ప‌డం వ‌ల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌న్నారు. మాన‌సికంగా ఎంతో సంతోషంగా ఉండ‌టానికి నో అన్న‌ది కార‌ణంగా మారుతుంద‌న్నారు. మాన‌సిక నిపుణులు కూడా ఈ విష‌యాన్ని ఎంతో స్ప‌ష్టంగా చెప్పార‌ని గుర్తు చేసారు. ఏ ప‌ని చేసినా పూర్తి సంతృప్తితో చేయాల‌ని..అసంతృప్తితో చేయోద్ద‌ని..ఇలా చేయ‌డం వ‌ల్ల మాన‌సికంగా కొంత ప్ర‌భావం చూపిస్తుంద‌న్నారు. జీవితం విష‌యంలో కొన్ని స‌రిహ‌ద్దులు గీసుకుని ఉన్న‌ప్పుడే స‌మాజంలో విలువ, గౌర‌వం పెరుగుతాయ‌న్నారు. సులువైన ప‌నులు ఎంత తేలిగ్గా చేయ‌గ‌ల్గుతామో? క‌ష్ట‌మైన వాటి విష‌యంలో అంతే స‌వాల్ గాను భావించి ప‌ని చేయాల‌ని సూచించారు.

ప్రతి విషయాన్ని సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఇక ఐశ్వ‌ర్యారాయ్ కొంత కాలంగా సిని మాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పొన్నియ‌న్ సెల్వ‌న్` లో న‌టించారు. ఆ త‌ర్వాత అవ‌కాశాలు వ‌చ్చినా ఛాన్స్ తీసుకోలేదు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఇరువార్` సినిమాతోనే ఐశ్వ‌ర్యారాయ్ న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఆయ‌న సినిమాతోనే కెరీర్ ముగింపు ద‌శ‌లోనూ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్యారాయ్ వ‌య‌సు ఐదు ప‌దులు దాటిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News