ఫ్యాషన్ కి పర్పెక్ట్ మీనింగ్ చెప్పిన బ్యూటీ!
ఇదే విషయాన్ని మాలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ మరోసారి ఉద్ఘాటించింది. కొందరు పేరు కోసమే ప్యాషన్ ట్రెండ్ ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.;
సెలబ్రిటీలు సందర్భాన్ని బట్టి రకరకాల ఫ్యాషన్ శైలిని ఎంచుకుంటారు. హాట్ కోచర్ రెడ్ కార్పెట్ కోసంఅవార్డు ఫంక్షన్లు, ఫిల్మ్ ఫెస్టివల్స్ లేదా మెట్ గాలా వంటి వేడుకల్లో సెలబ్రిటీలు ఖచ్చితంగా హాట్ కోచర్ దుస్తులనే ధరిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, సబ్యసాచి, వెర్సాచే లాంటి ప్రత్యేకంగా కొలతలకు తగ్గట్టుగా తయారు చేస్తారు. ఇవి చాలా ఖరీదైనవి. ఒక రకమైన డిజైన్ ఒక్కరి దగ్గర మాత్రమే ఉంటుంది. అథ్లీజర్ ఎయిర్‌పోర్ట్ అండ్ జిమ్ లుక్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ ఇది. ప్రయాణాల్లో, జిమ్‌కు వెళ్లేటప్పుడు వారు అథ్లీజర్ స్టైల్‌ను ఎంచుకుంటారు.
సౌకర్యవంతమైన ట్రాక్ ప్యాంట్లు, బ్రాండెడ్ హూడీలు, స్నీకర్లు యోగా వేర్ ఇందులో భాగాలుగా కనిపిస్తాయి. నైకీ, అడిడాస్ లేదా లూలూలెమన్ వంటి బ్రాండ్లను ఎక్కువగా ఇష్టపడతారు. పెళ్లిళ్లు, పూజలు , సినిమా ప్రమోషన్ల సమయంలో సెలబ్రిటీలు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ప్రస్తుతం సంప్రదాయ దుస్తులకు మోడరన్ టచ్ ఇచ్చే ఫ్యూజన్ వేర్స్. అంటే చీరపై బెల్ట్ ధరించడం లేదా లెహంగాపై క్రాప్ టాప్ లను ఎంచుకోవడం. ఓవర్ సైజ్డ్ టీషర్టులు, రిప్డ్ జీన్స్ , ఖరీదైన షూస్ ఈ లుక్‌లో ప్రధానం. ఇలా ఎన్ని రకాల ఫ్యాషన్ దుస్తులున్నా? సంప్రదాయ చీరకట్టు మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమనే చెప్పాలి.
ఇదే విషయాన్ని మాలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ మరోసారి ఉద్ఘాటించింది. కొందరు పేరు కోసమే ప్యాషన్ ట్రెండ్ ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేస్తే దీర్ఘ కాలం దాన్ని కొనసాగించలేమన్నది తన అభిప్రాయంగా పేర్కొంది. తాను ఫ్యాషన్ విషయంలో ఒకే శైలికి పరిమితం కానంది. `ఇండియా లాంటి గొప్ప దేశంలో పెరిగినప్పుడు రకరకాల దుస్తులను చూస్తుంటాం. నాకు చిన్నప్పటి అమ్మ చేనేత చీరలు కట్టుకోవడం చూస్తూ పెరిగాను. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే చీరలు కట్టుకుని నుదిటపై ఎర్రబొట్టు..కళ్లకు కాటుక, పువ్వులు పెట్టుకోవడమే.
అంతకు మించి భారత దేశంలో గొప్ప ఫ్యాషన్ అంటూ మరొకటి లేదు. మన సంస్కృతి, సంప్రదాయాల్ని మించిన ఫ్యాషన్ కన్నా ఏదీ గొప్పది కాదని తెలిపింది. చీరందం గురించి గొప్పగా వర్ణించే నాయికలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మాళవిక ఒకరు. కేరళ నుంచి దిగుమతి అయింది. ఈ బ్యూటీ ఇటీవలే రిలీజ్ అయిన `ది రాజాసాబ్` తో పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అమ్మడి చేతిలో తెలుగులో కొత్త అవకాశాలైతే లేవు.