డైరెక్టర్లే స్టార్ హీరోలు అవ్వొచ్చు!
కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఎలా మలుచుకున్నాడో తెలిసిందే.;
కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఎలా మలుచుకున్నాడో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా `కాంతార`ను సౌత్ లో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. అది కనెక్ట్ అయ్యేసరికి `కాంతార చాప్టర్ వన్`ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి ఏకంగా పాన్ ఇండియాలోనే రిలీజ్ చేసాడు. ఈ విజయంతో రిషబ్ శెట్టి స్టార్ డమ్ రెట్టింపు అయింది. తనని తానే డైరెక్ట్ చేసుకుని గొప్ప స్టార్ గా ఎదిగాడు. ఇండస్ట్రీలోఎ ఏ డైరెక్టర్ ఇలా ఎదగలేదు. ఇంత పెద్ద స్టార్ అవ్వలేదు. చాలా మంది దర్శకులుగా సక్సస్ అయిన తర్వాత నటులుగా మ్యాకప్ వేసుకున్న వారే.
ఆ తర్వాత దర్శకత్వాన్ని వదిలేసి నటులుగా కొనసాగడం మొదలు పెట్టారు. క్రియేటివ్ విభాగంలో ఉంటే? బ్రెయిన్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ నటనా విభాగంలో అంత శ్రమపడాల్సిన పనిలేదు. కూల్ గా ప్రశాంతంగా వెళ్లిపోతుంది. అలాగే టాలీవుడ్ లో కూడా క్రియేటివ్ విభాగం నుంచి హీరోలగా ఎదిగిన వారు లేకపోలేదు. కాకపోతే వారి సక్సెస్ రిషబ్ శెట్టి అంత గొప్పగా లేదన్నది వాస్తవం. అడవి శేష్ రైటర్ కం హీరో .అతడు ఏ సినిమా హీరోగా చేసినా ఆ సినిమా రైటింగ్ లో శేషు ఇన్వాల్వ్ మెంట్ ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో అతడి ప్రయాణం అలాగే మొదలైంది.
తాను స్టార్ గా ప్రమోట్ అవ్వడానికి కారణం కూడా తనలో రైటింగ్ స్కిల్సే. ఇంకా విశ్వక్ సేన్ కూడా తనని తానే స్టార్ గా మలుచుకున్నాడు. తొలి సినిమాను స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. విశ్వక్ కూడా మంచి రైటర్. అలాగే నవీన్ పొలిశెట్టి కూడా అలా ఎదిగిన వాడే. తాను హీరోగా నటించిన ప్రతీ సినిమా విషయంలో తన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందన్నాడు. డైరెక్టర్ మరొకరు అయినా? అతడితో సింక్ అయి పని చేయడం నవీన్ ప్రత్యేకత. ఈ ముగ్గురు నటులు ఇండస్ట్రీలో ఇంకా ఎదగాల్సిన వాళ్లు. నటులుగా మంచి భవిష్యత్ ఉంది.
సొంతంగా కథలు రాసుకునే సత్తా ఉన్న వారు. తమని ఎలా ప్రజెంట్ చేసుకుంటే? కనెక్ట్ అవుతారు? అన్నది బాగా ఐడియా ఉన్న నటులు కూడా. అయితే ఈ ముగ్గురు ఇన్నో వేటిట్ స్టోరీల్లో నటించాలి. పాత్రల స్పాన్ భారీగా ఉండాలి. పాన్ ఇండియాలో ఎలాంటి కాన్సెప్ట్ లు క్లిక్ అవుతున్నాయి? అన్నది మరింత స్టడీ చేసి సినిమాలు చేయాలి. అవి మరీ కమల్ హాసన్ తరహా అటెంప్స్ట్ లా కాకుండా కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి.