షాకింగ్ : అంబానీ రత్నాల వాచ్ ధర 45 కోట్లు
ఈ వాచ్ ధర, ఇతర విశేషాలు పరిశీలిస్తే తెలిసిన సంగతులు ఇవి. ఈ వాచ్‌ను అనంత్ అంబానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `వంటారా` జంతు సంరక్షణ కేంద్రం థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.;
దాదాపు 4000 కోట్ల ఖర్చుతో అంబానీ ఇంట పెళ్లి భాజా గురించి ఏడాది పైగానే చర్చించుకున్న సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జంట వివాహ మహోత్సవం కొన్ని నెలల పాటు ఎగ్జోటిక్ లొకేషన్లలో అద్భుతంగా కొనసాగింది. ఈ పెళ్లి కోసం క్రూయిజ్ షిప్ పార్టీని ఏర్పాటు చేయడం మరో హైలైట్. ఇక అనంత్ అంబానీ తన స్టాటస్ కి తగ్గ రేంజులో లైఫ్ స్టైల్ తోను అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. అతడు తన అద్భుతమైన వాచ్ కలెక్షన్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ధరించిన జాకబ్ అండ్ కో బ్రాండ్‌కు చెందిన `వంటారా` ఎడిషన్ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ వాచ్ ధర, ఇతర విశేషాలు పరిశీలిస్తే తెలిసిన సంగతులు ఇవి. ఈ వాచ్‌ను అనంత్ అంబానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `వంటారా` జంతు సంరక్షణ కేంద్రం థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఈ వాచ్‌లో మొత్తం 337 రత్నాలు పొదిగారు. ఇందులో విలువైన వజ్రాలు, కెంపులు ఇతర రత్నాలు ఉన్నాయి.
వాచ్ డయల్‌పై వంటారా లోగో.. జంతువుల ఆకృతులు కనిపించేలా చాలా క్లిష్టంగా డిజైన్ చేశారు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసారు. దీని బెల్ట్ నాణ్యమైన అల్లిగేటర్ లెదర్ తో రూపొందించారు. ఈ వాచ్ ధర వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దీని అంచనా ధర సుమారు రూ.40 కోట్లు నుండి రూ.45 కోట్లు. ఇది దాదాపు 5 మిలియన్ డాలర్లకు సమానం.
ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాదు.. ఒక అరుదైన కళాఖండం.. అనంత్ అంబానీ వద్ద ఇలాంటి కోట్లాది రూపాయల విలువైన వాచీలు చాలానే ఉన్నాయి. పటేల్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే వంటి పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్స్ కి చెందిన కస్టమైజ్డ్ వాచ్ లను అనంత్ అంబానీ ధరిస్తాడు.
`వంటారా` గురించి.. గుజరాత్ - జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ `వంటారా` ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద జంతు పునరావాస కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీకి జంతువులంటే ఉన్న ప్రాణాన్ని ఈ ప్రాజెక్ట్ ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అతడు ధరించిన ఈ వాచ్ కూడా దానికి ప్రతిబింబం.