మహేశ్ బాబు ఫస్టు టైమ్ వాడిన మొబైల్ అదేనట!

Update: 2021-09-25 04:02 GMT
మహేశ్ బాబు .. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. హీరో అంటే ఇలా ఉండాలి అనే కొలతలు ఏవైనా ఉంటే, అందుకు ఏ మాత్రం అటూ ఇటూ కాని హైటూ పర్సనాలిటీ ఆయన సొంతం. శోభన్ బాబు తరువాత అందగాడు అనిపించుకున్న హీరో ఆయన. కృష్ణ వారసుడిగా వచ్చినా, తనదైన టాలెంట్ తోనే ఆయన ఎదిగారు. తనకి తెలిసినది నటించడం ఒక్కటే, ఆ పనిని అంకితభావంతో చేయాలి అని నమ్మే వ్యక్తి మహేశ్ బాబు. అందువలన ఆయన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెడతారు. ఇక అనవసరమైన విషయాలను గురించి ఆయన ఆలోచన చేయరు .. అనవసరమైన వివాదాల్లో జోక్యం చేసుకోరు .. ఆయన అంత హ్యాండ్సమ్ గా కనిపించడానికి అదే ప్రధానమైన కారణం కూడా.

మహేశ్ బాబు తన సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. కథాకథనాలు .. తన పాత్ర విషయంలో పూర్తి స్పష్టత వచ్చేవరకూ ఆయన ఓకే చెప్పరు. ఇక తెరపై ఆయన చాలా సరదాగా .. సహజంగా తన పాత్రల్లో ఇమిడిపోతుంటారు. భయంకరంగా నటించేయాలనే ఉద్దేశంతో భారీ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడరు. ఒక సినిమా పూర్తయిన తరువాతనే మరో సినిమా చేయడం .. కొత్తదనం కోసం హెవీ లుక్స్ ట్రై చేయకపోవడం ఆయన ప్రత్యేకత. ఇక బయటకొస్తే తాను సూపర్ స్టార్ ననే విషయాన్ని ఆయన ఎంతమాత్రం పట్టించుకోకుండా చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనలో అభిమానులకు నచ్చేది అదే.

ఇక మహేశ్ బాబు తన సినిమాలపై కంటే యాడ్స్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తారనే టాక్ ఉంది. ఆయన తన క్రేజ్ కి తగిన ఉత్పత్తులకే ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకోసం ఆయన అందుకునే పారితోషికం కోట్లలో ఉంటుంది. యాడ్స్ లోను మహేశ్ తన స్పార్క్ చూపిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక మొబైల్ ఫోన్ రిటైల్ స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. అందుకు సంబంధించిన విలేకరుల సమావేశంలో, "మీరు వాడిన ఫస్టు మొబైల్ ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. తాను మొట్టమొదటి సారిగా 'నోకియా క్లాసికల్ మోడల్' ను ఉపయోగించినట్టు ఆయన చెప్పారు.

"మీతో సెల్ఫీలు తీసుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపుతుంటారు గదా, మీకు ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని ఉంటుంది? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "మా నాన్నతో .. " అంటూ సమాధానమిచ్చారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి మహేశ్ బాబు ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉంటాడనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమా షూటింగుతో బిజీగా ఉన్న ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులను త్రివిక్రమ్ .. రాజమౌళిలతో కలిసి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రెండూ కూడా ఆయన కెరియర్లో ప్రత్యేకమైనవనే టాక్ బలంగా వినిపిస్తోంది.     
Tags:    

Similar News