ఓ మాస్ తమిళ పాటేసుకున్న సూర్య

Update: 2020-01-25 14:19 GMT
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'సూరరై పొట్రు' అనే చిత్రంలో నటిస్తున్నారు.  'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎయిర్ డెక్కన్ స్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితమే ఆధారం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది.  తాజాగా ఈ సినిమా నుండి 'మారా' అంటూ సాగే పాటను విడుదల చేశారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు జీ.వీ. ప్రకాష్ కుమార్.  ఈ 'మారా' పాటను హీరో సూర్య స్వయంగా ఆలపించడం విశేషం.  కొంచెం రాపు గొంతుతో పాడిన ఈ పాట తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  పాట పవర్ఫుల్ గా ఉంది. ఇక స్టూడియోలో పాట పాడుతున విజువల్స్ తో పాటుగా టీజర్ లాగా సినిమాలోని ఇతర విజువల్స్ చూపించడంతో సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది.   ఈ సినిమాను 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటను తెలుగులో కూడా సూర్య పాడతారా లేదా అనేది వేచి చూడాలి.  ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూర్య ఈమధ్య నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. మరి ఈ సినిమాతో సూర్య ఒక సాలిడ్ హిట్ సాధించి మునుపటి ఫామ్ లోకి వస్తారా అనేది వేచి చూడాలి. ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
Full View
Tags:    

Similar News