• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ ప్రొడ్యూసర్ కొత్త...

స్టార్ ప్రొడ్యూసర్ కొత్త సినిమా.. రతి

By - Tupaki Desk
Update: 2016-11-21 11:30 GMT
దేవి.. దేవీపుత్రుడు.. ఒక్కడు.. వర్షం.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ చిత్రాల వరస చూస్తే చెప్పేయొచ్చు ఎమ్మెస్ రాజు ఎలాంటి నిర్మాతో. హీరోల్ని చూసి.. దర్శకుల్ని చూసి సినిమాలకు వెళ్లినట్లే.. నిర్మాతల్ని చూసి కూడా సినిమాలకు వెళ్లడం అన్నది ఎమ్మెస్ రాజు లాంటి వాళ్ల విషయంలోనే జరుగుతుంటుంది. ఎమ్మెస్ రాజు తర్వాత ఇలాంటి గుర్తింపు సంపాదించిన దిల్ రాజు కూడా.. తనకు ఆయనే ఆదర్శం అంటారు. అదీ ఆయనకున్న గుర్తింపు.

ఐతే ‘పౌర్ణమి’ తర్వాత ఆయన తిరోగమనం ప్రారంభమై.. వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయారు. తన స్వీయ దర్శకత్వంలో కొడుకును హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘తూనీగ తూనీగ’ కూడా దెబ్బ తినడంతో ఇండస్ట్రీ నుంచి దాదాపుగా కనుమరుగైపోయారు రాజు. మధ్యలో ‘రమ్’ పేరుతో ఏదో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫీలిం అన్నారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఐతే ఇప్పుడు ‘రతి’ అంటూ ఓ వెరైటీ సినిమాను అనౌన్స్ చేశారు రాజు.

టైటిల్ చూస్తుంటేనే జనాలకు రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి. మామూలుగా బి-గ్రేడ్ సినిమాలకు మాత్రమే ఇలాంటి టైటిళ్లు పెడుతుంటారు. కానీ రాజు మాత్రం ఇది ఒక గొప్ప ప్రయత్నం అంటున్నారు. తెలుగు.. తమిళం.. హిందీ.. కన్నడ - మలయాళం.. మరాఠీ.. ఇలా ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇదొక ఎరోటిక్ ఎంటర్టైనర్ అని ఆయనంటున్నారు. ఇంత విరామం తర్వాత ఇలాంటి సినిమాతో రాజు పునరాగమనం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానంటున్నారు రాజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • M S Raju 
  • Rathi 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS