• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: కమర్షియల్...

ట్రైలర్ టాక్: కమర్షియల్ మీటర్లో లవ్ రాత్రి!

By - Tupaki Desk
Update: 2018-08-06 12:06 GMT
బాలీవుడ్ లో స్టార్లతో పాటు చాలామంది గాడ్ ఫాదర్లు ఉంటారు.. అలాంటివాళ్ళలో సల్మాన్ ఖాన్ పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి.  సల్మాన్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎంతోమంది పాపులర్ అయ్యారు కూడా.  హీరోయిన్లను మాత్రమే కాకుండా హీరోలను కూడా తన సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించి మరీ పరిచయం చేస్తుంటాడు. ఇప్పుడు సల్మాన్ తన బావమరిది అయిన అయుష్ శర్మ ను 'లవ్ రాత్రి' సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.  ఇంతకీ అయుష్  శర్మ ఎవరో తెలుసా.. సల్మాన్ ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ హస్బెండ్.

ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజే సల్మాన్ విడుదల చేశాడు.  రెండు నిముషాల నలభై రెండు సెకండ్లున్న ఈ సినిమా ట్రైలర్ అంతా ఓ ఫార్మాట్ ప్రకారం సాగిపోయే డెబ్యూ హీరో సినిమాల్లానే ఉంది.  సుశ్రుత్(ఆయుష్ శర్మ) అనే ఓ దారీ తెన్ను లేని బరోడా అబ్బాయి.. ఓ ఫారిన్ నుంచి హాలిడేస్ లో వచ్చిన హీరోయిన్ తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి నవరాత్రి జరిగే తొమ్మిది రోజులు మాత్రమే ఇండియా లో ఉంటుంది.  సో.. అప్పట్లోపు లవ్ లో పడెయ్యాలి. పడేస్తే సరిపోతుందనుకుంటే సినిమాకు సెకండ్ హాఫ్ లేనట్టే.  ఇక అమ్మాయి లవ్ లో పడిన తర్వాత అమెరికా కు వెళ్లి పోతుంది.. అక్కడ బిగ్ షాట్ అయిన హీరోయిన్ తండ్రి హీరోను పట్టించుకోడు.  సో ఆయన్ను ఒప్పించాలి, ప్రేమను గెలిపించుకోవాలి.  ఇదంతా ట్రైలర్ లో నే రివీల్ చేశారు మేకర్స్.

ట్రైలర్ అంతా కలర్ఫుల్ గా ఉంది.  నవరాత్రి పండగ  నేపథ్యంలో సాగే ఒక లవ్ స్టొరీ ఇదని ట్రైలర్ లో చూపించారు.  ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ - సినిమాటోగ్రఫీ అంతా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత సినిమా నుండి అధ్బుతమైన కంటెంట్ ను ఆశించడం కాస్త  కష్టమే.

వరీనా హుస్సేన్ ఈ సినిమాతో  హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  అభిరాజ్ మీనావాలా డైరెక్టర్.  ఈ చిత్రాన్ని అక్టోబర్ ఐదున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  మీరు ఆ 'లవ్ రాత్రి' ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Aayush Sharma 
  • Warina Hussain 
  • Loveratri Trailer 
  • Loveratri Movie Trailer 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS