• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'లవ్‌ స్టోరీ'...

'లవ్‌ స్టోరీ' స్ట్రీమింగ్‌ అలర్ట్‌

By - Tupaki Desk
Update: 2021-10-11 07:30 GMT
ఈమద్య కాలంలో థియేటర్లలో విడుదల అయిన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతాయా అంటూ ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో విడుదల అయిన సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో వాటికి ఓటీటీ లో మంచి డిమాండ్ ఉంటుంది. కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లని వారు ఓటీటీ లో కాస్త ఆలస్యంగా అయినా సినిమాలను చూడాలని ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదల అయిన లవ్‌ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో సెకండ్‌ వేవ్‌ తర్వాత అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా కూడా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. అయినా కూడా ఇంకా చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా లవ్‌ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది.

లవ్‌ స్టోరీని ఆహా లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్‌ 24న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ను నాలుగు వారాల తర్వాత ఆహా లో స్ట్రీమింగ్‌ కు ఉంచబోతున్నారు. అంటే అక్టోబర్ 22న ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దసరా తర్వాత ఆహా లో రాబోతున్న సినిమాలు వెబ్‌ సిరీస్ ల గురించి ఆహా వారు ప్రకటించారు. దసరా నుండి సంక్రాంతి వరకు తమ ఆహా లో అద్బుతమైన కంటెంట్‌ రాబోతున్నట్లుగా ప్రకటించిన టీమ్‌ ఆహా లవ్‌ స్టోరీ సినిమాను దసరా తర్వాత విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అయిన లవ్‌ స్టోరీ సినిమాను ప్రేక్షకులు థియేటర్ల ద్వారా ఆధరించారు. అలాగే ఓటీటీ లో కూడా సక్సెస్ చేస్తారనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. సాదారణంగా సినిమాలు ఆలస్యం అయితే జనాల్లో ఆసక్తి తగ్గుతుంది. కాని శేఖర్‌ కమ్ముల మరియు సాయి పల్లవిల కాంబోలో ఫిదా తర్వాత వచ్చిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. సాయి పల్లవి మరియు నాగ చైతన్యల నటన మరియు వారి మద్య లవ్‌ సీన్స్ కు అంతా కూడా ఫిదా అయ్యారు. శేఖర్ కమ్ముల ఇలాంటి ఒక మంచి మెసేజ్ మూవీ తీస్తాడని ఊహించలేదు అంటూ పలువురు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేశారు. చైతూ కెరీర్ బెస్ట్‌ నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సాయి పల్లవి డాన్స్ తో మళ్లీ ఆకట్టుకుంది. మ్యూజికల్‌ గా కూడా సక్సెస్‌ ను దక్కించుకున్న లవ్‌ స్టోరీ మళ్లీ ఓటీటీ లో సక్సెస్‌ అయ్యేనో చూడాలి.

సినిమా తాజాగా విడుదల అయిన తర్వాత థియేటర్లలో హౌస్‌ ఫుల్ బోర్డులు కనిపించాయి. చాలా నెలల తర్వాత థియేటర్ల వద్ద ఆ బోర్డులను చూసిన ఇండస్ట్రీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేశారు. చాలా మంది లవ్‌ స్టోరీ సినిమాకు మద్దతుగా నిలిచి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ప్రమోట్‌ చేశారు. లవ్ స్టోరీ ఒక మంచి మెసేజ్ తో కూడా వచ్చింది. కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యింది. లవ్‌ స్టోరీ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయితే ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయని.. ఆహా లో ఒక మంచి సినిమాగా కూడా నిలుస్తందనే అభిప్రాయంతో ఉన్నారు.
Tags:    
  • Lovestory 
  • Lovestory movie 
  • Naga chaitanya 
  • Lovestory ott 
  • Lovestory aha 
  • Lovestory ott release date 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS