ఆ స్టార్ హీరోల నిర్మాతలకి చుక్కలు కనిపిస్తున్నాయా...?

Update: 2020-07-02 05:00 GMT
మహమ్మారి కారణంగా గత 100 రోజులకు పైగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అయి ఉంది. ఫలానా సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది అని చెప్పుకోవాల్సింది  మహమ్మారి వల్ల 100 డేస్ వేస్ట్ గా పోయాయి అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ మహమ్మారి వలన సినీ ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ పడింది. దీని నుండి ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఫైనాన్సియర్స్ దగ్గర డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్స్ దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అవకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కి అనుమతిస్తున్నా రోజురోజుకి  మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండటంతో చిత్రీకరణ స్టార్ట్ చేసే అవకాశాలు లేకుండాపోయాయి. దీంతో నిర్మాతలు మరింత నష్టాలలో కూరుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

ఇక  మహమ్మారి ప్రభావం తగ్గి థియేటర్స్ ఓపెన్ అయినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని ఇప్పటికే అర్థం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నిర్మాతలు విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి లేదు. బడ్జెట్ విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భారీ రెమ్యూనరేషన్ తీసుకునే డైరెక్టర్, టెక్నీషియన్స్ హీరో హీరోయిన్ల పారితోషకాల్లో కోతలు విధిస్తే నిర్మాత అంతో ఇంతో కోలుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోలీవుడ్ లో కొంతమంది హీరోలు.. డైరెక్టర్లు స్వచ్ఛందంగా రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని ముగ్గురు స్టార్ హీరోలని ప్రొడ్యూసర్స్ సంప్రదించి ' మహమ్మారి టైమ్.. సిట్యుయేషన్ ఏంటో మీకు తెలుసు.. కాస్త అగ్రిమెంట్ లో చేసుకున్న కొన్ని డీల్స్ మార్చుకుందామని' అడిగారట.

ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ స్టార్ హీరోలు ఏమిటా డీల్స్.. ఆ డీల్స్ మారిస్తే నేను కూడా మారాల్సి ఉంటుంది అనే రీతిలో సమాధానం చెప్పారట. ఇక మరో హీరో అగ్రిమెంట్ మార్చేద్దాం కానీ సినిమా లాభాల్లో 50 పర్సెంట్ వాటా ఇవ్వాలని.. దీంతో పాటు 40 కోట్లు రెమ్యూనిరేషన్ గా ఇవ్వాలని కండిషన్ పెడుతున్నాడట. ఇప్పటికే ఈ ముగ్గురు హీరోలు తమ అప్ కమింగ్ సినిమాలకి సంబందించిన నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్రెడీ రాయించేసుకున్నారట. ఇప్పుడు ఆ సినిమాల నిర్మాతలు ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ తామే తీసుకుంటామని అడుగుతున్నారట. అయితే వారు మాత్రం రైట్స్ అమ్మిపెట్టి వచ్చే వాటాతో సినిమాలో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. వారిలో కొందరు మాత్రం ఈ రైట్స్ స్యూరిటీగా పెట్టి ఫైనాన్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిన ఈ స్టార్ హీరో నిర్మాతలకి ఇప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News