మనోజ్- మౌనిక@ 3 ఏళ్లు.. హెల్ప్ చేయడంలో ఇద్దరూ నెం.1!

నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న భూమా మౌనిక రెడ్డి వివాహ బంధానికి మూడేళ్లు పూర్తి అవ్వగా.. సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తున్నాయి.;

Update: 2026-03-03 12:25 GMT

నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న భూమా మౌనిక రెడ్డి వివాహ బంధానికి మూడేళ్లు పూర్తి అవ్వగా.. సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తున్నాయి. అయితే 2023 మార్చి 3న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన మనోజ్- మౌనిక పెళ్లి వేడుక అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది



 




 


ఇప్పుడు మూడు సంవత్సరాల వైవాహిక జీవితం పూర్తవడంతో మనోజ్, మౌనిక జంట మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సినీ వర్గాల్లో పరిచయాల ద్వారా సంబంధాలు ఏర్పడుతుంటాయి. కానీ మనోజ్- మౌనికల పరిచయం మాత్రం ఫిట్‌ నెస్, సోషల్ ఏరోబిక్స్ ద్వారా మొదలైంది. ఒకేలాంటి ఆలోచనలు, క్రమశిక్షణ, జీవిత లక్ష్యాలు వారిని దగ్గర చేశాయి. అదే పరిచయం తర్వాత ప్రేమగా, చివరికి పెళ్లిగా మారింది.



 




 


ఇప్పటికే వారి కుటుంబం మరింత విస్తరించింది. కుమారుడు ధీరవ్ యాక్టివ్ నెస్, క్రీడలపై ఆసక్తితో అందరినీ ఆకట్టుకుంటుండగా, 2024 ఏప్రిల్ 2న జన్మించిన కూతురు దేవసేన శోభా మంచు కుటుంబానికి కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. తన కూతురిని మనోజ్ ప్రేమగా ఎంఎం పులి అని పిలవడం సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.



 




 


అయితే పెళ్లి తర్వాత మనోజ్ కెరీర్‌ లో గుడ్ ఛేంజ్ కనిపిస్తోంది. వరుస సినిమాలతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చిన ఆయన తన ఎనర్జీ, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులతో బిజీగా షూటింగ్స్‌ లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. సినిమా రంగంతో పాటు సంగీత రంగంలో కూడా అడుగుపెట్టి 2025 నవంబరులో మోహన రాగ మ్యూజిక్ పైరుతో మ్యూజిక్ లేబుల్‌ ను ప్రారంభించారు.



 




 


ఇక మౌనిక కూడా వ్యాపారరంగంలో సైలెంట్‌ గా పెద్ద విజయాలు సాధిస్తున్నారు. ఆమె స్థాపించిన నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్ అనే టాయ్ బ్రాండ్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు 75 వేలకు పైగా ఐటెమ్స్ అమ్ముడవ్వగా, 300కి పైగా స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ రిటైల్ చైన్లు మదర్ కేర్, అమెజాన్, ఫస్ట్ క్రై వేదికలపై బ్రాండ్ అమ్మకాలు సాగుతున్నాయి.



 




 


రీసెంట్ గా రిలయన్స్ రిటైల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని మరింత విస్తరణకు సిద్ధమవుతోంది. సినిమా, వ్యాపారం మాత్రమే కాకుండా ప్రజాసేవపై కూడా ఆ జంట దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలతో ఎప్పుడు దగ్గరగా ఉంటూ.. అవసరమైనప్పుడు సాయం చేయడం వారికి అలవాటు. అందుకే అభిమానులు వీరిని సెలబ్రిటీ జంటగా కాకుండా బాధ్యత గల సెలబ్రిటీలుగా చూస్తున్నారు. కష్టపడి ఎదిగిన మనోజ్, ధైర్యంగా ముందుకు సాగిన మౌనిక.. ఇద్దరి కలయిక వారి స్ట్రెంత్. ఫ్యూచర్ లో మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News