'టాక్సిక్' బ‌జ్ ఓకే..కానీ ఆ ధైర్య‌మేంటో!

పాన్ ఇండియా వైడ్‌గా సంచ‌ల‌నం సృష్టించిన `కేజీఎఫ్`కి ముందు య‌ష్ అంటే క‌న్న‌డ‌లో త‌ప్ప ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో ఎవ‌రో ఎవ‌రికీ తెలియ‌దు.;

Update: 2026-03-03 11:21 GMT

పాన్ ఇండియా వైడ్‌గా సంచ‌ల‌నం సృష్టించిన `కేజీఎఫ్`కి ముందు య‌ష్ అంటే క‌న్న‌డ‌లో త‌ప్ప ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో ఎవ‌రో ఎవ‌రికీ తెలియ‌దు. అలాంటి యష్‌ని దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యేలా చేయాడ‌మే కాకుండా క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి దేశ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ని తెచ్చి పెట్టింది. దీంతో క‌న్న‌డ సినిమాకు పాన్ ఇండియా వైడ్‌గా మంచి బ‌జ్ క్రియేట్ అయింది. అలా కేజీఎఫ్ పుణ్య‌మా అని క‌న్న‌డ స్టార్స్ పాన్ ఇండియా సినిమాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం మొద‌లు పెట్టారు. అయితే ఈ విష‌యంలో రిష‌భ్ శెట్టి స‌క్సెస్ అయ్యాడే కానీ మిగ‌తా వారు స‌క్సెస్ కాలేక‌పోయారు.

దీంతో యష్ అంటే కర్ణాట‌క‌లోనే కాకుండా ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ మంచి క్రేజ్ ఏర్ప‌డింది. `కేసీఎఫ్ 2` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న త‌రువాత య‌ష్ నుంచి `కేజీఎఫ్ 3` వ‌స్తుంద‌ని అంతా ఊహించారు. అయితే దానికి భిన్నంగా లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్‌తో య‌ష్ `టాక్సిక్‌` మూవీని చేయ‌డం తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హాలీవుడ్ సినిమాల స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్ విమ‌ర్శల్ని ఎదుర్కోవ‌డంతో టాక్సిక్ దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయింది.

నెగెటివ్ ప్ర‌చారం జ‌రిగినా భారీ స్థాయిలో ఈ మూవీకి ఫ్రీ ప్ర‌మోష‌న్ ల‌భించింది. అఫీషియ‌ల్ టీజ‌ర్‌ని జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేశారు. దీంతో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సినిమా బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగింది. బ‌జ్ కూడా భారీగానే ఉంది. మార్చి 19న ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏరియాల వైజ్‌గా బిజినెస్ కూడా పూర్త‌యింది. గ్లింప్స్‌, టీజ‌ర్‌ల‌తో దేశ వ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అయితే రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా టీమ్‌లో ఎలాంటి ప‌రుగు క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోందనే విమర్ళ‌లు వినిపిస్తున్నాయి. బ‌జ్‌కు త‌గ్గ‌ట్టుగా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ఎందుకు చేయ‌డం లేద‌ని, పేరే తెలియ‌ని డైరెక్ట‌ర్ సినిమా విష‌యంలో ఇంత ధైర్యం ఏంటో అని కన్న‌డ ఆడియ‌న్స్ వాపోతున్నారు. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో స్పీడు పెంచాల్సింది పోయి ఇలా న‌త్త‌న‌డ‌క‌న ప‌ని చేస్తున్నార‌నే కామెంట్‌లు స‌ర్వ‌త్నా వినిపిస్తున్నాయి. ఈ రేంజ్ సినిమాని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లేది పాట‌లే. అవే ఇప్పుడు `టాక్సిక్‌`కు మైన‌స్ అవుతున్నాయి.

రీసెంట్‌గా `త‌బాహి` పాట‌ని విడుద‌ల చేశారు. య‌ష్‌, కియారాల‌పై షూట్ చేసిన ఈ పాట‌కు సంబంధించిన విజువ‌ల్స్ లేకుండానే కేవ‌లం ఒక ఫోటోతో పాట‌ని రిలీజ్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మిగ‌తా సినిమాలు ఇప్ప‌టికే ఆడియోతో నేష‌న‌ల్ వైడ్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ సినిమాపై భారీ బ‌జ్‌ని సొంతం చేసుకుంటుంటూ `టాక్సిక్‌` టీమ్ మాత్రం ప్ర‌మోష‌న్స్‌ని అనుకున్న స్థాయిలో చేయ‌డం లేద‌ని ప‌లువురు వాపోతున్నారు. మార్చి 19నే సంచ‌ల‌న మూవీ `ధురంధ‌ర్ 2` కూడా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌మోష‌న్స్‌తో అద‌ర‌గొట్టాల్సిన `టాక్సిక్‌` చాలా కూల్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం, ఎలాంటి హ‌డావిడీని ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం షాక్‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌లేదు. మ‌రి ట్రైల‌ర్‌తో దేశ వ్యాప్తంగా హంగామా మొద‌లు పెడ‌తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News