టాక్‌ సూప‌ర్ హిట్ కానీ..క‌లెక్ష‌న్స్‌...!

ఫిబ్ర‌వ‌రి రెండ‌వ వారంలో విడుద‌లైన `క‌పుల్ ఫ్రెండ్లీ`, చివ‌రి వారంలో విడుద‌లైన `విష్ణు విన్యాసం`.;

Update: 2026-03-03 12:59 GMT

ఈ మధ్య చిన్న సినిమాల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. టాక్‌కు రెవెన్యూకు సంబంధం ఉండ‌టం లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. అయితే టాక్‌కు త‌గ్గ రేంజ్‌లో మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక షాక్ ఇస్తున్నాయి. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లైన రెండు సినిమాలు సోష‌ల్ మీడియాలో మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి. అంతే కాకుండా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల్ని కూడా ద‌క్కించుకున్నాయి. కానీ టాక్‌కు త‌గ్గ‌ట్టుగా మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల పరంగా రాణించ‌లేక‌పోయాయి.

ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించ‌డమే కాకుండా సోష‌ల్ మీడియాలోనే మంచి బ‌జ్‌ని క్రియేట్ చేసిన ఆ రెండు సినిమాలు ఎందుకు రాణించ‌లేక‌పోయాయి? బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని ఎందుకు రాబ‌ట్ట‌లేక‌పోయాయి? ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యాయి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫిబ్ర‌వ‌రి రెండ‌వ వారంలో విడుద‌లైన `క‌పుల్ ఫ్రెండ్లీ`, చివ‌రి వారంలో విడుద‌లైన `విష్ణు విన్యాసం`. ఇందులో సంతోష్ శోభ‌న్, మాన‌స వార‌ణాసి జంట‌గా న‌టించిన `క‌పుల్ ఫ్రెండ్లీ` రొమాంటిక్ డ్రామాగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది.

కానీ క్రిటిక్స్ నుంచి మాత్రం మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురిపించినా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ఆ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఫిబ్ర‌వ‌రి 14 శ‌నివారం విడుద‌లైన ఈ సినిమాకు ఫ‌స్ట్ మండే వ‌చ్చే స‌రికి ప్రేక్ష‌కుల సంద‌డే లేదు. సినిమా బాగుంద‌న్నారే కానీ థియేట‌ర్ల‌కు రావ‌డానికి మాత్రం ఎవ‌రూ ఆస‌క్తిని చూపించ‌లేదు. కార‌ణం వారు కోరుకున్న స్థాయిలో సినిమా లేక‌పోవ‌డ‌మేన‌ని, అంతే కాకుండా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్స్ ఇందులో లేక‌పోవ‌డ‌మేన‌ని కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

ఇక కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా పేరు తెచ్చుకున్న శ్రీ‌విష్ణు న‌టించిన కామెడీ ఎంట్‌టైన‌ర్ `విష్ణు విన్యాసం`. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌లైన ఈ సినిమాకు సోష‌ల్ మీడియాలో మంచి బ‌జ్ క్రియేట్ అయింది. శ్రీ‌విష్ణుకు మ‌రో హిట్ ప‌క్కా అని అంతా భావించారు. ఓపెనింగ్స్ భారీగా ఉంటాయిని అంచ‌నా వేశారు. కానీ సీన్ రివ‌ర్స్.. ఆడియ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తే క్రిటిక్స్ యావ‌రేజ్‌గా తేల్చారు. అందుకు అనుగునంగానే క‌లెక్ష‌న్‌లు పెద్ద‌గా రాలేదు. శ్రీ‌విష్ణు సినిమా అంటే మినిమ‌మ్ గ్యారెంటీ అనే టాక్ ఉంది.

కానీ ఈ సినిమా విష‌యంలో అదేమీ ప‌నిచేయ‌లేదు. అనుకున్న క‌లెక్ష‌న్స్ రాలేదు. దీంతో టీమ్ షాక్‌కు గురైంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొందిన రెండు సినిమాల‌కు థియేట‌ర్ల‌లో ఇలాంటి ప‌రిస్థితి ఏంటీ? అనే అంత‌ర్మ‌థ‌నం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మొద‌లైంది. కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వ‌చ్చాం. చాలా వ‌ర‌కు సినిమాల‌కు అదే జ‌రిగింది. కానీ ఈ సినిమాల విష‌యంలో కంలెంట్ ఉన్నా కానీ ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డంతో నిర్మాత‌ల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కుల మైండ్ సెట్ విష‌యంలో మార్పులు మొద‌ల‌య్యాయా? అనే కోణంలో ప్రొడ్యూస‌ర్స్ విశ్లేష‌ణ చేస్తున్నారు.

Tags:    

Similar News