కిల్లర్ లుక్స్ కిల్లింగ్ మూవ్స్‌తో AI హీరోయిన్ కలకలం
బుల్లితెరపై సరికొత్త విప్లవం మొదలైంది. సాంకేతికత నానాటికీ విస్తరిస్తున్న వేళ వినోద రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అడుగుపెట్టింది.;
బుల్లితెరపై సరికొత్త విప్లవం మొదలైంది. సాంకేతికత నానాటికీ విస్తరిస్తున్న వేళ వినోద రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అడుగుపెట్టింది. ఇప్పటికే ఆర్జీవీ, కమల్ హాసన్ లాంటి అడ్వాన్స్ డ్ థింకింగ్ ఉన్న ప్రముఖులు కృత్రిమ మేథస్సును సద్వినియోగం చేయడంపై దృష్టి సారించారు. ఆర్జీవీ రీసెర్చ్ ప్రకారం.. భవిష్యత్‌లో సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ పని ఉండదు...క్రియేటర్లు ఎవరి పని వారే చేసుకోవచ్చు. తన క్రియేటివిటీ తన ఐడియాలజీ తన అభిరుచి ప్రకారం.. ఒక సినిమాని సాంకేతికతను ఉపయోగించి తయారు చేయొచ్చని వర్మ విశ్లేషిస్తున్నారు. పరిమిత కాస్టింగ్.. పరిమిత క్రూతో చాలా సినిమాలను రూపొందించేందుకు కృత్రిమ మేథస్సు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు.
అంటే ఒక పూర్తి నిడివి సినిమాని ఏఐ సహకారంతో తీయగలరు. ఈ టెక్నాలజీపై నాలెజ్ ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే...ఇప్పుడు ఏకంగా మొట్టమొదటి ఏఐ హీరోయిన్ పుట్టుకు రావడం కలకలం రేపుతోంది. నైనా ఏవిటిఆర్ (Naina Avtr) ఇప్పుడు తాజా సెన్సేషన్. ఈ ఏఐ - బ్యూటీ కిల్లింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను, బుల్లితెరను షేక్ చేస్తోంది. కేవలం మనుషులు మాత్రమే నటించగలరనే భావనను చెరిపివేస్తూ.. ఈ ఏఐ సుందరి తన కిల్లర్ మూవ్స్‌తో ప్రేక్షకుల మతి పోగొడుతోంది.
నైనా అవతార్ చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంది.. అద్భుతమైన హావభావాలను పలికిస్తోంది. తన ఇన్‌స్టా రీల్స్‌లో చేసే డ్యాన్స్‌లు, ఇచ్చే ఫోజులు చూస్తుంటే ఇది నిజమైన మనిషే కదా! అనే సందేహం కలగక మానదు. గ్లామర్ పరంగా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ టెక్ బ్యూటీని డిజైన్ చేశారు. ట్రెండీ దుస్తుల్లో నైనా కనిపిస్తున్న తీరు.. ఆమె కళ్లలోని తీక్షణత యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈ ఏఐ హీరోయిన్‌ను ఒక టీవీ సీరియల్ కోసం రంగంలోకి దించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక రెగ్యులర్ టీవీ షో లేదా సీరియల్ లో నైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఒక వర్చువల్ క్యారెక్టర్ పూర్తిస్థాయి హీరోయిన్‌గా సీరియల్‌లో కనిపించడం భారతీయ టెలివిజన్ చరిత్రలోనే ఇది మొదటిసారి. సాంకేతికత, సృజనాత్మకత డామినేషన్‌కు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
అయితే ఈ వినూత్నమైన సీరియల్.. నైనా అవతార్ సందడి ఏ ఛానల్‌లో ప్రసారం కాబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం... ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ `స్టార్ ప్లస్` లో ఈ ప్రయోగాత్మక సీరియల్ ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను పెంచేశాయి.
నైనా ఏవిటిఆర్ రాకతో భవిష్యత్తులో వినోద రంగం ఎలా ఉండబోతుందో ఒక స్పష్టత వస్తోంది. నటీనటుల అవసరం లేకుండానే కేవలం టెక్నాలజీతో అద్భుతమైన కథలను వెండితెరపైనా, అలాగే బుల్లితెరపైనా ఆవిష్కరించవచ్చని ఈ `నైనా` నిరూపిస్తోంది. తన కిల్లింగ్ లుక్స్‌తో కలకలం రేపుతున్న ఈ ఏఐ బ్యూటీ.. భవిష్యత్‌లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
నైనా ఎలా పుట్టింది? అంటే ఇది కేవలం 3డి ఇమేజ్ మాత్రమే కాదు.. ఇది మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీలో పుట్టిన అందమైన అమ్మాయి. తాజా టీవీ సీరియల్ స్టార్ ప్లస్ లో ఈ నెలాఖరు నుంచి 8 పీఎం నుంచి 10 పీఎం మధ్యలో ప్రసారమయ్యేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.