'ఓటిటి' ఒప్పందాలతో నిర్మాతలు నష్టపోతారా..?

Update: 2020-05-11 07:15 GMT
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో గత 40 రోజుల పైగా విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కన్పించడం లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు చిన్న సినిమాలను, మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయాలని నిర్మాతల వెంట పడుతున్న విషయం తెలిసిందే. నిజానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ లు చందాల ప్రాతిపదికన పనిచేస్తాయి కానీ రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన కాదు. అందుకే డిజిటల్ హక్కుల కోసం భారీగా డబ్బును ఖర్చు చేస్తే.. భారీ నష్టాలే మిగులుతాయి తప్ప భారీగా లాభాలను మాత్రం పొందలేరు.

అందుకే ఈ డిజిటల్ విడుదల ఒప్పందాలు కరెక్ట్ కాదని భావిస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్ల రిలీజ్ నుండి ఓటిటి లో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయని.. అంతేగాక ఓటిటిలు కూడా భారీ చిత్రాలను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయనే వార్తలు పుకార్లు మాత్రమే. చిన్న సినిమాల విషయంలో.. ఏ ఇండస్ట్రీ సినిమాలైనా చిన్న సినిమాలైతే వాటికీ ఓటిటి లలో మంచి ధరలకు సినిమా హక్కులు అమ్ముడవుతున్నాయి. చిన్న సినిమాలకు ఎలాంటి నష్టం ఉండదు. తక్కువ బడ్జెట్ తో రూపొంది నష్టం లేని బేరాలు చిన్న సినిమాలకే సాధ్యం అవుతుంది. ప్రస్తుతం భారీ సినిమాల హక్కులు కొనేందుకు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లు సిద్ధంగా ఉన్నాయట.

కానీ ఎందుకో ఇప్పుడు వెనకడుగు వేసినట్లు అన్పిస్తుంది. తాజాగా ఓటిటి విడుదల చిత్రాల జాబితాలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా చేరింది. ఇటీవలే ఈ సినిమా డైరెక్ట్ గా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని నిర్మాతలు కొట్టిపారేశారు. కానీ ఓటిటిలు భారీ సినిమాలకు బయట ప్రచారం నడుస్తున్న విధంగా భారీ ధరలు ఇవ్వడం లేదట. అసలే కరోనా సంక్షోభం.. కేంద్రం కూడా త్వరలో థియేటర్లు రిలీఫ్ అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ టైమ్ లో ఓటిటి కి అమ్మేసి నష్టపోవడానికి మన నిర్మాతలు సిద్ధంగా లేరని సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో..!
Tags:    

Similar News