• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్నీక్ పీక్: 'తిమ్మరుసు'...

స్నీక్ పీక్: 'తిమ్మరుసు' నుంచి అదిరిపోయే లిఫ్ట్ ఫైట్..!

By - Tupaki Desk
Update: 2021-07-28 16:00 GMT
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా ''తిమ్మరుసు''. 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో విడుదల చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయబడిన థియేట్రికల్ ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ఫైట్ సీన్ స్నీక్ పీక్ ను వదిలారు.

పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ 'తిమ్మరుసు' మూవీలోని లిఫ్ట్ ఫైట్ సీన్ ని విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందించారు. ''చాలా ఆసక్తికరమైన మరియు చమత్కారమైన కాన్సెప్ట్. తిమ్మరుసు చిత్రం నుండి ఈ లిఫ్ట్ ఫైట్ చూసి ఎంజాయ్ చేశాను. ప్రియమైన కోనేరు మహేష్ & సత్యదేవ్ మరియు మొత్తం చిత్ర బృందం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమాను సేవ్ చేయండి. లాంగ్ లివ్ సినిమా'' అని థమన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

'తిమ్మరుసు' చిత్రంలోని ఈ లిఫ్ట్ ఫైట్ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుంది. సత్యదేవ్ ఒక లిఫ్ట్ లో బయలుదేరి, బయటకు వచ్చే సమయానికి రౌడీలను కొట్టి పడేసే ఈ కాన్సెప్ట్ అలరిస్తోంది. ఇందులో క్రిమినల్ లాయర్ రామచంద్ర గా సత్యదేవ్ కనిపిస్తున్నారు. 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్ గా నటించింది. ఇందులో బ్రహ్మాజీ - అజయ్ - ప్రవీణ్‌ - ఆదర్శ్‌ బాలకృష్ణ - ఝాన్సీ - వైవా హర్ష - సంధ్యా - జనక్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం సమకూర్చగా.. అప్పూ ప్రభాకర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'తిమ్మరుసు' టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి?, 'అసైన్‌మెంట్‌ వాలి' అనే ట్యాగ్ లైన్ వెనకున్న అసకు కథేంటి? అనేది తెలియాలంటే జులై 30 వరకు ఆగాల్సిందే.


Full View
Tags:    
  • Satyadev 
  • Thimmarusu 
  • Trailer Talk 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS