బాలయ్య అభిమానులకు ఇంకో పండగ
గత ఏడాది 28వ తారీఖు నుంచి బాలయ్య అభిమానులు ఎన్ని పండగలు చేసుకున్నారో లెక్కే లేదు. ఆ రోజు లెజెండ్ రిలీజై సూపర్ హిట్ తెచ్చుకోవడంతో మొదలయ్యాయి సంబరాలు. ఆ తర్వాత సినిమా ఇరగాడేయడంతో వాళ్ల ఆనందానికి హద్దుల్లేకపోయింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లతో లెజెండ్ రికార్డు సృష్టించింది. ఎంత పెద్ద హిట్టయినా మూణ్నాలుగు వారాలవగానే థియేటర్ల నుంచి సినిమాను లేపేస్తున్న సమయంలో 31 కేంద్రాల్లో వంద రోజులాడేసి అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తింది. ఆ తర్వాత రెండు సెంటర్లలో 175 రోజులు, 200 రోజులు, 275 రోజులు, 365 రోజులు.. ఇలా ఆడుతూనే పోతోందా సినిమా.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మినీ శివలో డైరెక్టుగా, కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్లో షిఫ్ట్‌తో 365 రోజులు పూర్తి చేసుకుని 400వ రోజు దిశగా దూసుకెళ్తోంది లెజెండ్. ఏడాది ప్రదర్శన తర్వాత సినిమాను తీసేయడం ఖాయమనుకున్నారు కానీ.. ఇప్పటికీ ఆ రెండు థియేటర్లలో ఆడుతూనే ఉందా సినిమా. ఈ నేపథ్యంలో 400వ రోజు వేడుకలకు కూడా ముహూర్తం పెట్టేశారు. మే 2న 400 రోజుల పండగను ఎమ్మిగనూరులో చేయనున్నట్లు బాలయ్యే స్వయంగా తెలిపాడు. ఇంతకుముందు 275 రోజుల వేడుకను ప్రొద్దుటూరులో చేశారు. ఇప్పుడు ఎమ్మిగనూరు వంతొచ్చింది. మినీ శివ థియేటర్లో జరిగే వేడుకకు బాలయ్యతో పాటు లెజెండ్ యూనిట్ సభ్యులు చాలామంది రాబోతున్నారు. అప్పటికి లయన్ కూడా విడుదలై ఉంటుంది కాబట్టి బాలయ్య అభిమానులకు పండగే పండగ.