మద్యం మత్తులో ప్రముఖ సీరియల్ నటి.. అరెస్ట్

Update: 2021-12-08 11:30 GMT
సీరియల్స్ లో నటిస్తూ పాపులర్ అయిన లహరి చిక్కుల్లో పడింది. హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో ఆమె యాక్సిడెంట్ చేసింది. స్వయంగా కారు నడుపుతున్న లహరి ఓ వ్యక్తిని ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడున్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి అతడిని ఆస్పత్రికి తరలించారు.

ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టిన లహరి అతడికి రక్తమోడుతున్నా కూడా కనీసం కారులోంచి దిగకపోవడంతో స్థానికులంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లహరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

మద్యం సేవించి లహరి కారు నడిపినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన దీనిపై రాలేదు. ప్రస్తుతం మా టీవీలో వస్తోన్న‘గృహలక్ష్మీ’ అనే సీరియల్ లో లహరి నటిస్తోంది.

సీరియల్స్ చేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ తో బిజీగా ఉన్నారు నటి లహరి. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్ అన్నీ తనకు ఇష్టమైనవేనని చెబుతారు.

చాలా సంవత్సరాల నుంచి ఈమె సీరియస్ లో నటిస్తూనే ఉంది. ఈటీవీ, జీతెలుగు, మాటీవీలో ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Tags:    

Similar News