ల్యాండ్ మార్క్ మూవీ.. చైతూ స్ట్రాంగ్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ యంగ్ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి అందరికీ తెలిసిందే. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన చైతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2026-02-09 05:32 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి అందరికీ తెలిసిందే. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన చైతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ.. డిఫరెంట్ స్టోరీలతో రూపొందే సినిమాలు చేస్తూ.. ఆకట్టుకుంటున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం కెరీర్ లో 24వ మూవీగా వృష కర్మ చేస్తున్న నాగచైతన్య.. ల్యాండ్ మార్క్ 25వ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న వృష కర్మ షూటింగ్ చివరి దశలో ఉండగా.. నెక్స్ట్ మూవీపై చైతూ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఎవరితో చేస్తారన్నది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

కానీ సినీ వర్గాల్లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే చైతూ 25వ మూవీ.. శివ నిర్వాణతో చేస్తారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. స్టోరీని విన్నారని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. అదే సమయంలో స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నాగచైతన్య తన ల్యాండ్ మార్క్ మూవీ చేస్తారని కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని గుసగుసలు వినిపించాయి.

కానీ దానిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో మళ్లీ శివ నిర్వాణనే ఫిక్స్ అని అంతా అనుకున్నారు. ఇంతలో కిషోర్ అనే కొత్త దర్శకుడితో నాగచైతన్య చేతులు కలిపినట్లు ప్రచారం జరిగింది. ఆయన చెప్పిన స్టోరీ చైతూకు బాగా నచ్చిందని, అందుకే ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. త్వరలో అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. అయితే అవి కూడా రూమర్లుగా తేలింది.

దీంతో చైతూ ల్యాండ్ మార్క్ మూవీ డైరెక్టర్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. ముందు నుంచి అనుకున్న శివ నిర్వాణ.. ఇప్పుడు సీనియర్ రవితేజతో ఇరుముడి సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. కాబట్టి ఆయనతో చైతూ మూవీ ఫ్యూచర్ లో ఉండొచ్చు. కానీ 25వ సినిమా మాత్రం శివ నిర్వాణ డైరెక్ట్ చేయడం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది.

ఇప్పుడు కొన్ని రోజులుగా బెదురు లంక 2012 ఫేమ్ క్లాక్స్ పేరు వినిపిస్తోంది. ఆయన మంచి లవ్ స్టోరీ రాసుకున్నారని, అది చైతూకు బాగా నచ్చిందని సమాచారం. దీంతో ప్రాజెక్టు ఫిక్స్ అయిందని, త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. బన్నీ వాసు నిర్మించనున్నారని వినికిడి. మొత్తానికి తనకు బాగా కలిసొచ్చిన జానర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీ చైతూ చేయనుండడం గమనార్హం. దీంతో స్ట్రాంగ్ ప్లాన్ వేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News