ఎరుపులో దిశా ప‌టానీ క‌ళాత్మ‌క భంగిమ‌లు

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ వ‌రుస ఫోటోషూట్లు వెబ్ లో సునామీ సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిమిషాల్లోనే ల‌క్ష‌లాదిగా ఫాలోవ‌ర్స్ దిశా ప్ర‌తి పోస్ట్ కి స్పందిస్తుంటారు.;

Update: 2026-02-09 05:27 GMT

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ వ‌రుస ఫోటోషూట్లు వెబ్ లో సునామీ సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిమిషాల్లోనే ల‌క్ష‌లాదిగా ఫాలోవ‌ర్స్ దిశా ప్ర‌తి పోస్ట్ కి స్పందిస్తుంటారు. ఈసారి కూడా అదే రెస్పాన్స్. లోఫ‌ర్ బ్యూటీ తన అద్భుతమైన ఫోటోషూట్లతో ఇంటర్నెట్‌లో మ‌రోసారి సెన్సేషన్ సృష్టించింది. ఈసారి ఎరుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో తాజా ఫోటోషూట్ ని పోస్ట్ చేసింది. తాజా ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి.



 


ముఖ్యంగా ఎరుపు రంగు ఫ్లోర‌ల్ టాప్, హాఫ్ షోల్డ‌ర్ లుక్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. ఇక ఈ టాప్ ని క‌వ‌ర్ చేస్తూ, ఒక ఎరుపు రంగు కాంబినేష‌న్ చీర‌ను దిశా ఆస‌రాగా చుట్టుకుని క‌నిపించింది. ఇక మెడ‌లో కాంబినేష‌న్ కెంపులు, రత్నాలు పొదిగిన బంగారు ఆభ‌ర‌ణాన్ని ధ‌రించింది. దీనికి తెల్ల‌ని ముత్యాల అల్లిక అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మారింది. దిశా అందాన్ని ప‌దింత‌లు ఎక్కువ‌గా ఎలివేట్ చేసింది ఈ హారం. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్ కి త‌గ్గ‌ట్టే దిశా ఫోజులు కూడా వేడి పుట్టిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.



 


పంజాబీ గాయకుడితో ప్రేమాయణం?

గత కొంతకాలంగా దిశా పటానీ, ప్రముఖ పంజాబీ గాయకుడు తల్వీందర్ ఒక‌రితో ఒక‌రు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే డేటింగ్ నిజమేనా? అని ప్ర‌శ్నిస్తే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తల్వీందర్ ఈ రూమర్లపై స్పందించారు. తామిద్దరం ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రక్రియలో ఉన్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. ప్రతిరోజూ ప్రేమలో పడుతుంటాను.. ప్రస్తుతం కూడా ప్రేమలో ఉన్నాను! అని హింట్ ఇచ్చేసాడు. దీంతో దిశా పటానీతో అత‌డు ప్రేమ‌లో ఉన్నాన‌ని అంగీక‌రించిన‌ట్టేనని అభిమానులు భావిస్తున్నారు.



 


ఇటీవల కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ వివాహ వేడుకలో దిశా- త‌ల్వింద‌ర్ జంటగా కనిపించారు. అంతేకాకుండా, ముంబైలో జరిగిన పలు ఈవెంట్లలో చేతులు పట్టుకుని నడుస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇప్పటివరకు దిశా దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.



 


దిశా ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. షాహిద్ కపూర్ సరసన దిశా పటానీ ఓ రోమియో అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఇందులో `జూలీ` అనే పాత్రలో దిశా కనిపించనుంది. చాలా కాలంగా చిత్రీక‌ర‌ణ లేక ఆల‌స్య‌మైపోయిన వెల్ కం టు ది జంగిల్ (వెల్ కం ఫ్రాంఛైజీ చిత్రం) త్వ‌ర‌లో రావాల్సి ఉంది. ఇది భారీ మ‌ల్లీస్టార‌ర్. అలాగే ఆవారాప‌న్ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే దిశా ప‌టానీ హాలీవుడ్ లో ప్ర‌వేశిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హోలిగార్డ్స్ సాగా- ది పోర్ట‌ల్ ఆఫ్ ఫోర్స్ అనే ఇంగ్లీష్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మెరవబోతోంది. క‌ల్కి 2898 ఏడి త‌ర్వాత టాలీవుడ్ లో దిశా త‌దుప‌రి సినిమా గురించి ఇంకా వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. త‌మిళంలోను కంగువ త‌ర్వాత త‌న ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు లేవు.



 


Tags:    

Similar News