మ‌ద్యం బ్రాండ్ల‌కు ప్ర‌చార‌మా? నోనో అనేస్తున్న రాక్ష‌సి!!

Update: 2020-11-27 05:30 GMT
సాంప్ర‌దాయాలు విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చి కొంద‌రు స్టార్లు క‌మర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కోలాలు ర‌మ్మీల‌కు ఆల్క‌హాల్ బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల పుట్టి ముంచే తార‌లు ఎంద‌రో. కానీ అందుకు భిన్నంగా ర‌జ‌నీకాంత్ .. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్లు ప్ర‌జామోదం కాని వాటికి ప్ర‌చారం చేసేందుకు ఎన్న‌డూ ఆస‌క్తిని క‌న‌బ‌రచ‌లేదు. ఆఫ‌ర్లు వ‌చ్చినా వాటిని సున్నితంగా తిర‌స్క‌రించారు. వారి బాట‌లో చాలామంది స్టార్లు ఆమోద‌యోగ్యం కాని బ్రాండ్ల ప్ర‌చారానికి ఆఫ‌ర్ వ‌చ్చినా వ‌దులుకున్న సంద‌ర్భాలున్నాయి.

ఇప్పుడు అందాల రాక్ష‌సి లావణ్య త్రిపాఠి కొన్ని మద్యం బ్రాండ్ల ప్ర‌చారానికి తిరస్కరించార‌న్న‌ది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ‌లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ యువ‌నాయిక త‌న‌వైపు వ‌చ్చిన లేటెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఆఫ‌ర్ల‌కు నో చెప్పేసింద‌ట‌.

స‌ద‌రు మ‌ద్యం బ్రాండ్ల‌కు పెద్ద మొత్తాలను చెల్లించడానికి కార్పొరెట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. లావణ్య నిర్మొహ‌మాటంగా వ‌ద్ద‌నుకుంది. పాపుల‌ర్ కంపెనీలు అయినా ఆల్కహాల్ బ్రాండ్లను తిర‌స్క‌రించ‌డంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. లావ‌ణ్య సామాజిక బాధ్యతతో ప్ర‌వ‌ర్తించ‌డం పై అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ భామ‌ ప్రస్తుతం ఆమె ఎ 1 ఎక్స్‌ప్రెస్ .. చావు కబురు చల్లగా అనే రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Tags:    

Similar News