సినిమా పాపులారిటీకి సాయంచేస్తున్న 'ప్రాపర్టీ'

Update: 2016-09-26 05:18 GMT
ఒక ప్రాపర్టీ(వస్తువు)ని తీసుకుని దాన్ని కధలో కీలకాంశంగా మార్చి దాని చుట్టూనే కథను నడపడం ఏ రచయితకైనా సవాలే. అయితే ఈ కాన్సెప్ట్ లో తెరకెక్కిన సినిమాలు తెలుగునాట మంచి విజయాలు సాధించాయి. ఈ మధ్యన ప్రాపర్టీ బేస్డ్ కధలు ఎక్కువవడం గమనార్హం.

తనకు కొండంత ధైర్యాన్ని అందించే లక్కీ కాయిన్ చుట్టూ తిరిగే రాజేంద్ర ప్రసాద్ కొబ్బరిబొండం సినిమా నుండి, లగేజ్ స్లిప్ కోసం తిరిగే క్షణ క్షణం, రికార్డయిన క్యాసెట్ కోసం ఛేజ్ చేసే అనగనగా ఒక రోజు చిత్రమైనా, బొమ్మ చుట్టూ తిరిగే ఆమ్మో బొమ్మ సినిమానైనా, ఆకాశగంగ కోసం సహాయపడే ఆత్మలింగాన్వేషణలో అంజి అయినా వీటికి సరైన ఉదాహరణలు.    

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఈ కాన్సెప్ట్ ని బాగా వాడుకుని విజయాలు సాధిస్తున్నాయి. నిఖిల్ స్వామి రారా వినాయకుడి విగ్రహం చుట్టూ అల్లిన కధే. శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా కుక్క మెడలో దాచిన వజ్రం గురించే. ఇక రీసెంట్ గా వచ్చిన సునీల్ ఈడు గోల్డ్ ఎహె ట్రైలర్ చూస్తే లాఫింగ్ బుద్దా విగ్రహం కీ రోల్ అని అర్ధమవుతుంది. మరి సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాకూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. 

Full View
Tags:    

Similar News