మ‌హేష్ .. మ‌రో వేడెక్కించే అప్ డేట్‌

Update: 2019-08-28 14:31 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే.  అనీల్ రావిపూడి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. డెడ్ లైన్ ప్ర‌కారం పూర్తి చేసి సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప‌క్కా ప్రిప‌రేష‌న్స్ తో ముందుకెళుతున్నారు. మ‌హ‌ర్షి త‌ర‌హాలో త‌లెత్తిన డైల‌మా ఈసారి లేక‌పోవ‌డంతో ఓవైపు షూటింగుల్లో పాల్గొంటూనే త‌దుప‌రి ప్రాజెక్టుల‌పైనా మహేష్ పూర్తి స్థాయిలో దృష్టి సారించార‌ని తెలుస్తోంది.

మ‌హేష్ 26 ప్రారంభించ‌క ముందు నుంచి మ‌హేష్ 27 ఎవ‌రితో చేయ‌బోతున్నారు? అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ 26 చేయాల్సిన‌ది కాస్తా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తో క్యాన్సిల్ అవ్వ‌డం అనీల్ రావిపూడికి ఆయాచిత వ‌రంగా మారింది. సుకుమార్ త‌ర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్ లైన‌ప్ లో ముందుకు వ‌చ్చి చేర‌డంతో రావిపూడి రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే ఆన్ లొకేష‌న్ స్పాట్ బోయ్ ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ న‌టించ‌బోయే 27వ సినిమాకి మ‌హూర్తం ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది.

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. జ‌న‌వ‌రి మూడో వారంలో సినిమాని ప్రారంభించి ఆగ‌స్టు 7న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. స్టార్ డైరెక్ట‌ర్ కొరటాల శివ‌తో క‌లిసి మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. `స‌రిలేరు..` చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ర‌త్న‌వేలు మ‌రోసారి మ‌హేష్ తో ప‌ని చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌హేష్ 27 క‌థాంశం ఏమిటి? అంటే.. గీత గోవిందం లాంటి పీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని అందించిన ప‌ర‌శురామ్ కి అదే త‌ర‌హాలో కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాని చేయాల్సిందిగా మ‌హేష్ సూచించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మ‌హేష్ ఇమేజ్ కి త‌గ్గ క్యారెక్ట‌రైజేష‌న్ ని తొలుత ఎంపిక చేసుకుని ఫ్యామిలీ విలువ‌ల్ని ఆపాదించి ఫ‌న్-ఎమోష‌న్ జోడించిన క‌థ‌తో ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

    

Tags:    

Similar News