క్రిష్ ప్లానింగ్ ఇలానే ఉంటుంది మరి..

Update: 2017-01-16 09:00 GMT
ఒక చారిత్రక సినిమాను ఎన్నిరోజుల షూటింగ్ అవసరం అవుతుందన్న  ప్రశ్న గతంలో అడిగితే.. చాలామంది చాలా మాటలే చెప్పేశారు. శాతకర్ణి పుణ్యమా అని అలాంటి ప్రశ్నల్ని ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండా చేసేశారు దర్శకుడు క్రిష్. అవసరమైన చోట గ్రాఫిక్స్ ను వాడేస్తూ.. వీలైనంతవరకూ త్వరగా సినిమాను పూర్తి చేయటం ఎలా అన్న అంశం మీదనే క్రిష్  ఫోకస్ అన్నది ఇప్పుడు తెలిసిపోయింది.

తక్కువ రోజుల్లో సినిమా తీశారు కాబట్టి.. క్వాలిటీ విషయంలో క్రిష్ రాజీ పడతారని అనుకుంటే తప్పులోకాలేసినట్లేనని శాతకర్ణి సినిమా చెప్పేసింది. 79 రోజుల వ్యవధిలో ఇంత భారీ సినిమాను ఏ మాత్రం తేడా రాకుండా.. ఊహించిన దాని కంటే రిచ్ గా ఎలా తీశారు? ఎలా సాధ్యమైందంటే.. అదంతా క్రిష్ ప్లానింగ్ లోనే ఉందని చెప్పాలి.

శాతకర్ణి దాకా ఎందుకు.. క్రిష్ తన తర్వాతి సినిమాపై అప్పుడే కసరత్తు చేసేస్తున్నాడట. శాతకర్ణి ప్రమోషన్లో బిజీగా ఉంటున్నప్పటికీ.. వెంకీతో తన తర్వాతి ప్రాజెక్టు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వెంకీ ‘గురు’ సినిమా పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఆయన కూడా తన తర్వాతి సినిమా మీద ఫోకస్ చేస్తున్నారట. కొత్త  సినిమాకు ఏమేం చేయాలన్నది వీరిద్దరూ అప్పుడే డిసైడ్ చేసేశారట. అంతేకాదు.. ఈ కొత్త సినిమాలో గ్రాఫిక్స్ కాస్త ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలా అని సినిమా నిర్మాణం ఆలస్యం కాకుండా ఉండటం కోసం.. ఇప్పటికే  వెంకీ.. క్రిష్ ఇద్దరూ ఒక లైన్ ఆఫ్ ఆర్డర్ సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ముందుగా సీజీ వర్క్ తో పని ఉన్న గ్రీన్ మ్యాట్ షాట్ లు పూర్తి చేసేసి.. ఆ తర్వాత మిగిలిన పని చూసుకుంటారట. షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి గ్రాఫిక్స్ షాట్లు మొత్తం రెఢీ అవుతాయని.. దీంతో.. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేయొచ్చని.. ఆలస్యమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. క్రిష్ ప్లానింగ్ సరే.. వెంకీ తాజా సినిమాకు గ్రాఫిక్స్ తో అంత అవసరం ఏమిటన్నది ఇప్పుడు కొత్త సందేహం మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News