క్రిష్ కూడా జ‌క్క‌న్న‌ బాట‌లో..ఎలానో తెలుసా?

Update: 2017-01-17 05:05 GMT
రాజ‌మౌళి తాను తీసిన బాహుబ‌లిని - ఆ చిత్రం కోసం సృష్టించిన మ‌హిష్మితి రాజ్యాన్ని కేవ‌లం సినిమాకే ప‌రిమితం చేయ‌లేదు. టీవీ సిరీస్‌ - కామిక్ బుక్‌ - మ‌ర్చండైజ్‌ - యానిమేష‌న్‌... ఇలా ర‌క‌ర‌కాల మాధ్య‌మాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నానికి పూనుకున్నారు. దాంతో  టీవీల్లోనూ - కామిక్ బుక్కుల్లోనూ  బాహుబ‌లి చిత్రం - అందులోని పాత్ర‌లు ప‌ది కాలాల‌పాటు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూనే ఉండిపోతాయ‌న్న‌మాట‌. ఇప్పుడు  క్రిష్ కూడా అదే ప‌ద్ధ‌తిని ఫాలో అయ్యేందుకు న‌డుం బిగించాడు. ఇటీవ‌ల తాను తీసిన  గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి క‌థని గ్రాఫిక్ నవ‌ల‌గా తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారాయ‌న‌. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికీ - బాహుబ‌లికీ ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయి. రెండూ చారిత్రాత్మ‌క అంశాల‌తో ముడిప‌డ్డ‌వే.  మొద‌ట్నుంచీ క్రిష్ తీస్తున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని బాహుబ‌లితో పోల్చి చూశారు.

బాహుబ‌లికి మ‌హిష్మ‌తి రాజ్యం ఎలాగో - శాత‌క‌ర్ణికి అమ‌రావ‌తి అలా. రెండు చిత్రాలూ  వేల సంవ‌త్స‌రాల కింద‌టి క‌థ‌తోనే తెర‌కెక్కాయి. రెండింట్లోనూ యుద్ధాలు - ఫాంట‌సీ అంశాలు ఉంటాయి. అందుకే క్రిష్ త‌న `గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి`ని కూడా  గ్రాఫిక్ న‌వ‌ల‌తో పాటు, ఇత‌ర మ‌ర్చండైజ్ రూపంలో జ‌నంలోకి  తీసుకొచ్చేందుకు పూనుకొన్నారు. ఆ మేర‌కు ఛాయాగ్రాహ‌కుడితో క‌లిసి ప‌నులు కూడా మొద‌లుపెట్టారు. ఆ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించాడు క్రిష్‌. నిజానికి క్రిష్  గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌థ‌ని కొద్దిమేరే చెప్పాడు.  న‌వల‌గా అయితే ఆ క‌థ‌ని ఎంతైనా చెప్పొచ్చు. శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తులు చాలామంది ఉన్నారు. వాళ్లంద‌రి గురించీ చెబుతూ వెళితే మాత్రం అదొక మంచి ప్ర‌య‌త్న‌మే అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News