అప్పుడు మాత్రం కొరటాల ఏకాకే!

Update: 2016-11-01 12:30 GMT
ఇవాల్టి రోజుల్లో సినిమా సక్సెస్ కు దర్శకుడు కీలకం అయిపోయాడు. హీరో కంటే ఎక్కువగా ఆ హీరో ఎవరి డైరెక్షన్ లో చేస్తున్నాడన్నదే మెయిన్ పాయింట్ గా చూస్తున్నారు మార్కెట్ వర్గాలు. ఎవరి డైరెక్షన్ అయినా ఫ్యాన్స్ పెద్దగా తేడా ఫీలవరు కానీ.. కామన్ ఆడియన్స్ మాత్రం ఈ విషయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే కొందరు దర్శకులు తమను తాము ఒంటరితనంలోకి తోసేసుకుని స్క్రిప్టు రాసుకుంటున్నారు.

ఇలాంటి వారిలో కొరటాల శివను ప్రముఖంగా చెప్పుకోవాలి. స్క్రిప్ట్ రాసుకునేటపుడు.. ప్రీ ప్రొడక్షన్ పనులు చేసేటపుడు.. కొరటాల శివ ఆల్మోస్ట్ ఒంటరిగానే గడుపుతూ ఉంటాడట. బయటి ప్రపంచంతో సంబంధాలను కూడా దాదాపు కట్ చేసుకుని మరీ ఒంటరిగా గడుపుతాడని.. అందుకే స్క్రిప్ట్ లో ఉన్న ప్రతీ చిన్న ఎలిమెంట్ ను పాయింట్ చేయగలుగుతాడని చెబుతారు సన్నిహితులు. ఇంత పక్కాగా అన్నీ రెడీ చేసుకోవడంతోనే.. సినిమా మొదలుపెట్టాక ఏ స్థాయిలోనూ చిన్నపాటి కంగారు కూడా పడకుండా కూల్ గా పని చేసుకోగలుగుతాడని టాక్.

వరుసగా మూడు సినిమాలను బ్లాక్ బస్టర్లుగా చేసి.. అందులో రెండు ఇండస్ట్రీ హిట్స్.. ఆయా హీరోలు ముగ్గురికీ కెరీర్ బెస్ట్ ఇవ్వగలిగాడు కొరటాల. రీసెంట్ జనతా గ్యారేజ్ తో తిరుగులేని విజయాన్ని సాధించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న మూవీ కోసం తన స్టైల్ లోనే ఏకాకిగా మారిపోయి మరీ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News