• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇప్పటికైనా చరణ్ - కొరటాల...

ఇప్పటికైనా చరణ్ - కొరటాల కాంబో సెట్ అయ్యేనా...?

By - Tupaki Desk
Update: 2020-05-30 16:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో 2013లో ఒక ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏమైందేమో ఏమో కానీ ఈ సినిమా ఆగిపోయింది. రామ్ చరణ్ కెరీర్లో సినిమా స్టార్ట్ అయి ఆగిపోవడం మొదటిసారి ఏమీ కాదు. ఇంతక ముందు చరణ్ హీరోగా తమిళ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో ఆర్.బి. చౌదరి నిర్మాతగా 'మెరుపు' అనే సినిమా స్టార్ట్ అయింది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరుగునున్న తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. కాగా ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ - కొరటాల శివ కాంబినేషన్ లో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని వార్తలు వస్తున్నాయి.

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.  కొణిదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ జరుగునున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగ్ నిలుపుదల చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా అల్లు అర్జున్ తో అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం కొరటాల నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో ఉండబోతోందట. అప్పుడు మిస్ అయిన కాంబినేషన్ మళ్ళీ సెట్ అవబోతోందట. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే వీరి కలయికలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందట.

కాగా రామ్ చరణ్ దర్శకధీరుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోలో చరణ్ సాలిడ్ బాడీతో సాలిడ్ గా కనిపించాడు. ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా చరణ్ సిక్స్ ఫ్యాక్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. ఆర్.ఆర్.ఆర్ లో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Tags:    
  • Ram charan 
  • Koratala Siva 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS