• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోన కామెంట్స్ ఎవరి...

కోన కామెంట్స్ ఎవరి గురించి?

By - Tupaki Desk
Update: 2018-01-04 04:42 GMT
టాలీవుడ్ లో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో అంటే ప్రాణం పెట్టేస్తారు. వాళ్లను ఎవరైనా పల్లెత్తు మాటన్నా సహించరు. సినిమా హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా సదా తమ అభిమాన హీరోకు జైకొట్టేస్తుంటారు. ఈ తరహా ఫ్యాన్ బేస్ మిగిలిన హీరోల కంటే పవన్ కళ్యాణ్ కు చాలా చాలా ఎక్కువ. అందుకే పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడినా.. నెగిటివ్ గా మాట్లాడినా రెస్పాన్స్ చాలా హెవీగానే ఉంటుంది.

పవన్ రాజకీయ రంగప్రవేశం చేసి జనసేన పార్టీ పెట్టి.. ఇప్పుడు దాని కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నాడు.  ఈ టైంలో అతడిపై విమర్శల డోస్ పెరుగుతోంది. ఇదే టైంలో పవన్ మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కానీ.. మద్దతుగా నిలవడంలోగానీ ఫ్యాన్స్ తప్ప ఇండస్ట్రీ నుంచి ఎవరూ బహిరంగంగా ముందుకు రాలేదు. తాజాగా రైటర్ కోన వెంకట్ పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో నోరు విప్పాడు. ‘‘కొంతమంది జోకర్లు పవన్ కళ్యాణ్ మౌనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అలా ఎంతమాత్రమూ భావించవద్దు’’ అంటూ ఓ ట్వీట్ పెట్టాడు. కోన ఈ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి అన్నది డైరెక్ట్ గా చెప్పకపోయినా తగలాల్సిన వాళ్లకు తగిలాయలని అభిమానులు ఆనంద పడిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా అజ్ఞాతవాసి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమాకు సంబంధించి విశేషాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ నుంచి పవన్ కు సపోర్ట్ ఇస్తూ మాట్లాడటం వారి ఆనందాన్ని మరింత పెంచుతోంది. కోన కామెంట్ కు మద్దతుగా వందల్లో  రిప్లయ్ లు ఇవ్వడంతో పాటు రీట్వీట్లు పెడుతూ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.


Tags:    
  • Kona venkat 
  • Pawan kalyan 
  • Telugu Film INdustry 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS