గుండెపోటుతో తమిళ సీనియర్ యాక్టర్ మృతి..!
తమిళ చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం వారం రోజుల్లోనే ముగ్గురు ప్రముఖులు మరణించడం సినీ ప్రేక్షకులను కలచివేస్తోంది. అందులోను ఒకేరోజు ఓ స్టార్ డైరెక్టర్, ఓ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చనిపోవడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కరోనా సమయం కాబట్టి కనీసం మరణించిన వారికీ మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పలేకపోతున్నామని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు వాపోతున్నారు. ఈరోజు ఉదయం స్టార్ డైరెక్టర్ కేవీ ఆనంద్ మరణ వార్త విని కొద్దీ గంటలు గడవకముందే సీనియర్ యాక్టర్ ఆర్‌ఎస్‌జి చెల్లదురై మరణవార్త సినీలోకాన్ని విషాదంలో ముంచింది. సీనియర్ నటుడు ఆర్‌ఎస్‌జి చెల్లదురై గురువారం ఈరోజు సాయంత్రం చెన్నైలోని పెరియార్ నగర్‌లో గల ఇంటిలో గుండెపోటుతో మరణించారు.
దళపతి విజయ్ నటించిన తేరి,ధనుష్ మారి చిత్రాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. చెల్లదురై అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు వారి చర్చిలో జరిగినట్లు తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం 84ఏళ్లు. ఆర్‌ఎస్‌జి చెల్లదురై తమిళ చిత్రపరిశ్రమలో పేరొందిన సహాయక నటులలో ఒకరు. గురువారం ఆయన బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయినట్లు సమాచారం. ఆయన కుమారుడు చెల్లదురై గుండెపోటుతో మరణించారని తెలిపారట. చెల్లదురై మారి, థెరి, కత్తి, శివాజీలతో సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చెల్లదురై మరణవార్త తెలిసి ఆయన అభిమానులు, సహనటులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.